దేశ‌మంతా వేరు… తెలుగు రాష్ట్రాలు వేరంటున్న రాంమాధ‌వ్‌!

ఏదో ఒక అంశాన్ని చ‌ర్చ‌నీయంగా… ఇంకా చెప్పాలంటే వివాదాస్ప‌దంగా ఉంచితే త‌ప్ప ప‌బ్బం గ‌డుపుకోలేని ప‌రిస్థితిలో భాజ‌పా ఇప్ప‌టికీ ఉంది అనేది ఎప్ప‌టిక‌ప్పుడు రుజువౌతూనే ఉంటుంది! కాశ్మీరులో ర‌ద్దు చేసిన ఆర్టిక‌ల్ 370ని తెలంగాణ‌లో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను రాబట్టుకునేందుకు వాడేస్తున్నారు. ర‌ద్దు చేసిన ఘ‌న‌త మోడీ స‌ర్కారుది అని ప్ర‌చారం చేసుకుని స‌రిపెట్టుకుంటే త‌ప్పులేదు, కానీ తెలంగాణ‌ కూడా ఆర్టికల్ 370 కిందే ఉండాల్సి వ‌చ్చేద‌నీ భాజ‌పా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాం మాధ‌వ్ అన్నారు. సంస్థానాల విలీనం కోసం నాడు స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ కృషి చేశారు కాబ‌ట్టి హైద‌రాబాద్ విలీన‌మైంద‌నీ, అదే నెహ్రూ కృషి చేసి ఉంటే ఇక్క‌డా ఆర్టిక‌ల్ 370 త‌ప్పేది కాద‌ని ఆయ‌న అన్నారు. ఈ వ్యాఖ్య విన‌గానే ఏమ‌నిపిస్తోంది..? నెహ్రూ ప్రాధాన్య‌త‌ను తగ్గించాల‌నే మైండ్ సెట్ భాజ‌పాకి ఎప్ప‌ట్నుంచో ఉంది క‌దా, అది క‌నిపిస్తోంది. ఇంకోటి… చ‌రిత్ర గురించి ఊహాజ‌నితంగా మాట్లాడ‌టం, వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ని భాజ‌పాకి ఓన్ చేసే విధంగా వ్యాఖ్యానించ‌డం, తెలంగాణ‌లో 370 కింద‌కు రాకుండా ప‌రోక్షంగా తామే కాపాడేశాం అని‌ చెప్పుకోవాల‌న్న ఆత్రం ఉన్నాయి.

క‌రీంన‌గ‌ర్లో మాట్లాడిన రాం మాధ‌వ్ మ‌రో వ్యాఖ్య కూడా చేశారండోయ్! దేశ మొత్తాన్ని అభివృద్ధి ప‌థంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ న‌డిపిస్తున్నారు అన్నారు. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లు మాత్రం అప్పుల‌వైపు న‌డుస్తున్నాయ‌న్నారు. అప్పుల విష‌యంలో పోటీ ప‌డుతున్నాయ‌న్నారు. ఇక్క‌డి నాయ‌కుల స్వార్థం వ‌ల్ల‌నే తెలుగు రాష్ట్రాల‌కు ఈ దుస్థితి అని వ్యాఖ్యానించారు!

దేశం మొత్తం మోడీ అభివృద్ధి చేస్తుంటే… తెలుగు రాష్ట్రాలే అప్పుల్లో ఉన్నాయంటే, ఇక్క‌డ అభివృద్ధి గురించి కేంద్రం ఆలోచించ‌డంలేద‌ని ఆయ‌నే ప‌రోక్షంగా చెప్పిన‌ట్టు. దేశ‌మంతా బాధ్య‌త వ‌హిస్తున్న మోడీ… తెలుగు రాష్ట్రాల దగ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి ఎందుకు నిర్ల‌క్ష్య వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు? ఆంధ్రా, తెలంగాణ‌ అప్పుల ఊబిలోకి వెళ్తున్నాయంటే కేంద్రం ఆదుకోవచ్చు క‌దా. ఆదుకుని త‌మ‌దే ఘ‌న‌త అని ప్ర‌చారం చేసుకోండి, ఎవ‌రొద్ద‌న్నారు! రాష్ట్రాల్లో ఇలాంటి ప‌రిస్థితులు ఉంటే కేంద్రం బాధ్య‌త ఉండ‌దా..? ఇదేనా స‌మాఖ్య స్ఫూర్తి? కేవ‌లం భాజ‌పా పాలిత రాష్ట్రాలు, లేదా భాజ‌పాకి మోక‌రిల్లే రాష్ట్రాల్లో క‌నిపించే అభివృద్ధినే దేశాభివృద్ధి అని చెబుతారా..? ఇలాంటి వ్యాఖ్య‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశాలు పంపుతున్నామ‌నే ఆత్మ‌విశ్లేష‌ణ వారికి ఉండ‌దేమో అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close