పూరి మ‌త్తులో రామ్

పూరి జ‌గ్న‌నాథ్ ఓ వ్య‌స‌నం. చాలామంది హీరోలు ఈ మాటే అంటారు. పూరితో ఒక్క‌సారి ప‌నిచేస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌నుకోవ‌డానికి కార‌ణం అదే. ఇప్పుడు రామ్ కూడా అదే మ‌త్తులో ప‌డిపోయాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో `ఇస్మార్ట్ శంక‌ర్‌` రూపొందిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా ఫైన‌ల్ కాపీ ఈరోజు చూసుకున్న రామ్… స‌రికొత్త జోష్‌తో ట్వీట్ చేశాడు. `దీన‌మ్మా కిక్కూ..` అంటూ చేసిన ట్వీట్‌… రామ్‌లోని ఉత్సాహానికి, ఈ సినిమాపై త‌న‌కున్న న‌మ్మ‌కానికి అద్దం ప‌డుతోంది. త‌న పాత్ర స్క్రీన్ పై చూసుకున్న‌ప్పుడు త‌న‌కు కిక్ వ‌చ్చేసింద‌ని, ఇన్నేళ్లుగా ఏ సినిమా చూసినా రానంత కిక్ ఈ సినిమాతో అనుభ‌వించాన‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు రామ్‌. పూరిని ఓ డ్ర‌గ్‌గా అభివ‌ర్ణించాడు. ఈ సినిమాపై రామ్ ముందు నుంచీ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు. త‌న లుక్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాతో పూర్తిగా మారిపోయింది. ప్ర‌మోష‌న్లు కూడా జోరుగా చేస్తున్నాడు. ఇది వ‌ర‌కు ఏ సినిమాకీ చేయ‌నంత ప‌బ్లిసిటీ రామ్ ఈ సినిమాకి క‌ల్పిస్తున్నాడు. మ‌రి ఈ న‌మ్మ‌కం నిజ‌మ‌వుతుందో, లేదో తెలియ‌లంటే `ఇస్మార్ట్ శంక‌ర్‌` వ‌చ్చేంత వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com