రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో రాబోతున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే పాటని రిలీజ్ చేశారు. వివేక్ & మర్విన్ ఓ అందమైన ప్రేమ పాటని స్వరపరిచారు. రామ్ ఈ పాటకు లిరిక్స్ రాయడం మరో విశేషం.
ఒక చూపుతో నాలోనే పుట్టిందే
ఏదో వింతగా గుండెల్లో చేరిందే
నివ్వు ఎవ్వరో నాలోనే అడిగానే
తానేగా ప్రేమని తెలిపిందే
పరిచయం లేదని అడిగా
ప్రేమంటే కలిశాంగా
ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే
నువ్వుంటే చాలే..
ఈ లిరిక్స్ వింటుంటే రామ్ లో మంచి పోయెట్ వున్నాడనిపిస్తోంది. అనిరుద్ తనదైన శైలిలో పాటని ఆలపించాడు. ఈ సాంగ్ ప్రేమపాటల్లో మంచి స్థానం సంపాదించుకునేలానే వుంది. ఈ సినిమాలో స్టార్ హీరో ఉపేంద్రకి అభిమానిగా కనిపిస్తాడు రామ్. భాగ్యశ్రీతో తన ప్రేమకథ కూడా కీలకంగా వుంటుందని ఈ పాట తెలియజేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేస్తారు.