మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెరీర్ జెట్ స్పీడ్‌తో స్టార్ట్ అయింది. మగధీరతో పీక్స్‌కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మాత్రం నెక్ట్స్ లెవెల్‌కి వెళ్ళలేకపోయాడు చరణ్. మామూలు మసాలా సినిమాలతో హిట్స్ అనిపించుకుంటూ కాలం గడిపేశాడు. అలాగే ప్రమోషన్ యాక్టివిటీస్, ఇమేజ్ బిల్డింగ్ పైన కూడా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తన ఇమేజ్‌ని ఆకాశమంత రేంజ్‌కి తీసుకెళ్ళిన బాబాయ్ పవన్ నుంచి కూడా ఏమీ నేర్చుకోలేకపోయాడు చరణ్. నిజానికి హిట్టు, సూపర్ హిట్టు సినిమాల కంటే కూడా తన వ్యక్తిత్వం గురించి జరిగిన అద్భుతమైన ప్రచారంతోనే పవర్ స్టార్ క్రేజ్ స్కై లెవెల్‌కి వెళ్ళిపోయింది.
చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్‌ని బాగానే నేర్చుకున్న చరణ్…పవన్ ఇమేజ్ బిల్డింగ్ టెక్నిక్‌ని మాత్రం క్యాచ్ చేయలేకపోయాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్స్‌తో గొడవ, వెంట్రుక…అంటూ మాట్లాడిన మాటలతో పాటు ఇంకా కొన్ని విషయాలు కలిసి చరణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేశాయి. బ్రూస్ లీతో భారీ డిజాస్టర్‌ని చవిచూసిన చరణ్…ఆ తర్వాత నుంచి తన ఆలోచనా తీరు మార్చుకున్నాడు. కథల ఎంపిక విషయంలో కూడా కాస్త కొత్తగా వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు. అలాగే పిఆర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్. తన ఇమేజ్‌ని గొప్పగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. తన గొప్పతనం గురించి, తనలో ఉన్న గ్రేట్ క్వాలిటీస్ గురించి రెగ్యులర్‌గా ప్రచారం జరుగుతూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ధృవ ప్రమోషన్స్‌లో కూడా అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ‘పవనిజం’ ప్లాన్స్ అన్నీ కూడా చరణ్‌కి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.