చిరంజీవి సౌమ్యంగా వుంటారేమో.. మేము కాదు: రామ్ చరణ్

వాల్తేరు వీరయ్య సక్సెస్ వేడుకలో రామ్ చరణ్ పాల్గోవడం మెగా ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చింది. వరంగల్ లో జరిగిన వేడుకలో ఫ్యాన్స్ ఉత్సాహపరుస్తూ మాట్లాడారు చరణ్. ‘’ నేను ఇక్కడి ఒక అభిమానిగా వచ్చాను. ఈ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో మీతో పంచుకోవడానికి ఇక్కడి వచ్చాను’’ అన్నారు. ‘’వాల్తేరు వీరయ్య చూశాను. బాబీ ఇరగదీశాడు. ప్రతి ఫ్రేం ప్రేమతో నింపేశాడు. చిరంజీవి గారు మా నాన్న గారి లేరు.. మా బ్రదర్ లా వున్నారు. రవితేజ గారి ఒక డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దానిని కూడా మేము ఎంజాయ్ చేసేలా చేశాడు బాబీ. నిజంగా పూనకాలు లోడింగ్. నాతో పాటు అభిమానులందరికీ వాల్తేరు వీరయ్య గుర్తుండిపోయే చిత్రం.’’ అన్నారు.

ఇదే సందర్భంలో మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఈ మధ్య చిరంజీవి అతి మంచితనం గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఎన్ని విమర్శలు చేసిన ఆయన చాలా నెమ్మదిగా సర్దుకుపోతున్నారని, కనీస ప్రతివిమర్శ చేయడం లేదని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే టాపిక్ ని చరణ్ ప్రస్థావించాడు. ‘’చిరంజీవి గారు చాలా సౌమ్యులు అని అంటారు. ఆయన బిగించి మాట్లాడితే ఏమౌతుందో చాలా మందికి తెలీదేమో. వాళ్ళందరికి చిరంజీవి గారు నెమ్మదిగా సౌమ్యంగా వుంటారేమో గానీ మేము కాదు. నెమ్మదిగానే చెబుతున్నాం మేము నెమ్మదిగా ఉండం’’ అని స్వీట్ కామెంట్ వదిలారు చరణ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close