అఫీషియ‌ల్: రామ్ తో లింగుస్వామి

`రెడ్` త‌ర‌వాత‌.. రామ్ సినిమా ఏమిట‌న్న విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. రామ్ – లింగుస్వామితో జోడీ క‌ట్ట‌బోతున్నాడ‌న్న వార్త‌లే నిజం అయ్యాయి. లింగు స్వామి – రామ్ సినిమాల‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. రామ్ న‌టించే 19వ సినిమా ఇది. శ్రీ‌నివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. తెలుగు – త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రూపొందిస్తారు. రామ్ నేరుగా న‌టిస్తున్న తొలి త‌మిళ చిత్ర‌మిదే. క‌థానాయిక‌, ఇతర సాంకేతిక వ‌ర్గం వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు. ఇదో మాస్‌, మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలుస్తోంది.యాక్ష‌న్‌కి పెద్ద పీట వేస్తున్నారు. రామ్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే… బ‌డ్జెట్ కూడా భారీగా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. `పందెం కోడి`, `వెట్టై` చిత్రాల‌తో లింగు స్వామి త‌న స్టామినా ఏమిటో చూపించుకున్నాడు. అయితే ఈమ‌ధ్య లింగు స్వామికి వ‌ర‌స‌గా అన్నీ ఫ్లాపులే వ‌స్తున్నాయి. త‌మిళ హీరోలు సైతం లింగు స్వామిని ప‌క్క‌న పెట్టిన నేప‌థ్యంలో రామ్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇవ్వ‌డం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close