టీజర్ టాక్ : నేనే రాజు నేనే మంత్రి

త‌న కెరీర్‌లోనే పీక్ స్టేజ్‌లో ఉన్నాడు రానా. బాహుబ‌లి లాంటి భారీ విజ‌యం ఓ వైపు, ఘాజీ లాంటి ప్ర‌యోగాత్మ‌క విజ‌యాలు మ‌రోవైపు! రానా త‌న కెరీర్‌ని తానే నిర్మించుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైపోయింది. ఇప్పుడు మ‌రో హిట్ ప‌డితే.. రానా నిల‌బ‌డిపోవ‌డం ఖాయం. త‌న తాజా చిత్రం `నేనే రాజు నేనే మంత్రి` ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రామానాయుడు జ‌యంతి సంద‌ర్భంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ ఇంట్ర‌స్టింగ్‌గానే క‌ట్ చేశారు. నేనే రాజు నేనే మంత్రి అనే టైటిల్‌కి జ‌స్టిఫికేష‌న్ టీజ‌ర్‌లో క‌నిపించింది. ఇదో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాలో రానాని ఉరి తీస్తారని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే యాంటీ క్లైమాక్స్ అన్న‌మాట‌. ఈ పుకార్ని నిజం చేసేలా ఉన్నాయి టీజ‌ర్‌లో కొన్ని షాట్స్‌. తేజ ఓ హిట్టు కొట్టి త‌న‌ని తాను నిరూపించుకోవాల్సిన త‌రుణ‌మిది. రానా బండి జోరుమీదున్న ఈ స‌మ‌యంలో ఈ సినిమాపై ఆశ‌లు పెట్టుకోవొచ్చేమో అనిపిస్తోంది. చూద్దాం.. ఏం జ‌రుగుతోందో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మధ్యప్రదేశ్ సీన్ రాజస్థాన్‌లోనూ రిపీట్ అవుతోందా..?

జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి... బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... పట్టుమని ఏడాది కూడా ఉండలేకపోయింది. ఇప్పుడు అదే...

లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు..!

వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.....

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

HOT NEWS

[X] Close
[X] Close