భారతీయ తెరపైకి ‘రంగస్థలం’…

త్వరలో భారతీయ తెరపైకి ‘రంగస్థలం’ రాబోతోంది. భారతీయ ప్రేక్షకులు అందరికీ తెలుగు ప్రేక్షకులు మెచ్చిన రంగస్థలాన్ని చూపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ, తమిళ్, మలయాళం, భోజ్‌పురి తదితర భాషలన్నీ భారతీయ తెరలో భాగమే. గతంలో ఓ భాషలో హిట్టయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేసే ప్రక్రియ ఎక్కువ జరిగేది. ఇప్పుడూ జరుగుతోంది. ఇదే సమయంలో డబ్బింగ్ సినిమాలూ వున్నాయి. అయితే.. స్ట్రయిట్ సినిమాల తరహాలో డబ్బింగ్ సినిమాలకు వసూళ్లు రావడం తక్కువ. ముఖ్యంగా హిందీ మార్కెట్టులో డబ్బింగ్ చేసి విడుదల చేసిన మన తెలుగు సినిమాలు భారీ విజయాలు సాధించడం సందర్భాలు అరుదు. దీన్ని ‘బాహుబలి’ చెరిపేసింది. మంచి సినిమాకు భాషలు ఎల్లలు కాబోవని నిరూపించింది. ఇదే రూటును చాలా మంది ఫాలో అవుతున్నారు. సినిమా తీసేటప్పుడు హిందీ, తమిళ్, ఇతర భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

‘రంగస్థలం’ టీమ్ కాస్త లేటుగా ఈ ట్రెండున్బు ఫాలో అవుతోంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తీయాలనుకున్నారు. తరవాత తెలుగులో మాత్రమే తీసి, తమిళంలో డబ్బింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో ప్రేక్షకుల స్పందన చూసిన తరవాత తమిళంతో పాటు హిందీ, భోజ్‌పురి, మలయాళం, ఇతర భాషల్లో డబ్బింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. రామ్ చరణ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. డబ్బింగ్ పనులు త్వరలో మొదలుకానున్నట్టు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close