మహేష్ సినిమాలో రష్మి

బుల్లితెర మీద తన అందాల విందు చేసిన యాంకర్ రష్మి ప్రస్తుతం తన అంద చందాలన్ని రంగరించి చేసిన గుంటూర్ టాకీస్ మరో మూడు రోజుల్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్స్, పోస్టర్స్ అంతా గుంటూర్ టాకీస్ లో చేసిన హాట్ రొమాన్స్ గురించే మాట్లాడేలా చేస్తున్నాయి. అయితే రష్మికి ఈ సినిమా ఎంత క్రేజ్ తెచ్చిందో సినిమా రిలీజ్ ముందే తెలిసిపోయింది. అదెలా అంటే ఊహించని ఓ లక్కీ ఆఫర్ పట్టేసిందట రష్మి గౌతం.

సూపర్ స్టార్ మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. పారాస్ జైన్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ తో పాటుగా స్క్రీన్ షేర్ చేసుకోనుందట రష్మి. ఏంటి మహేష్ పక్కన రష్మి హీరోయిన్ గానా అని అనుకోవచ్చు. రష్మి సినిమాలో హీరోయిన్ గా కాదు కాని ఓ చిన్న పాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు కొనసాగిస్తున్నారట దర్శక నిర్మాతలు. గుంటూర్ టాకీస్ హిట్ అయితే రష్మికి వరుసగా ఆఫర్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సూపర్ స్టార్ మహేష్ సినిమాలో చిన్న రోల్ అయినా అది క్లిక్ అయితే కనుక రష్మికి ఇక తిరుగులేనట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close