పోలవరానికి, రాజధానికి ఇచ్చిన నిధులకి లెక్కలేవి? పురందేశ్వరి

ఆర్ధిక, రైల్వే బడ్జెట్ లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, రైల్వే జోన్ ఏర్పాటు, రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయనకి రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల కోరస్ పాడటం పూర్తయింది కనుక అటువైపు బీజేపీ నుండి దానికి కౌంటర్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. అటువంటి పనిలో ఎప్పుడూ ముందుండే బీజేపీ జాతీయ మహిళా మోర్చా నేత పురందేశ్వరి ఆలస్యం చేయకుండా వెంటనే కౌంటర్ ఇచ్చేసారు.

పోలవరానికి బడ్జెట్ లో తగినన్ని నిధులు మంజూరు చేయలేదని విమర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు దాని కోసం తీసుకొన్న నిధులకు లెక్క చెప్పాలని కోరారు. అసలు జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టులో కేంద్రం అనుమతి లేకుండా పట్టిసీమను అంతర్భాగంగా ఎందుకు చేర్చారని ఆమె ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమను చేర్చడం వలననే అది వివాదంగా మారిందని ఆమె అన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంఖించనవసరంలేదని అన్నారు. రాజధానికి తీసుకొన్న నిధులకు కూడా లెక్క చెప్పాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రప్రభుత్వం దాని కోసం గత ఏడాది రూ.1500 కోట్లు విడుదల చేస్తే ఆ సొమ్ము అంతా ఏమయిందని ఆమె తెదేపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆ నిధులను తెదేపా ప్రభుత్వం వేరే అవసరాలకొ లేకపోతే దుబారా ఖర్చులు చేస్తోందనో ఆమె భావిస్తున్నట్లయితే, కేంద్రప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రిని వాటికి లెక్కలు, సమాధానం కోరవచ్చును. తాము భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వంపై మీడియా ద్వారా పురందేశ్వరి ఈవిధంగా అనుమానాలు వ్యక్తం చేయడం సరయిన పద్ధతి కాదు. అలాగే తెదేపా ప్రభుత్వం కూడా కేంద్రం మంజూరు చేస్తున్న ఆ నిధులకు లెక్కలు అప్పజెప్పకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆరోపణలు చేయడం సరికాదు. రెండు పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రాష్ట్రానికి నష్టం కలిగిస్తూ ఈ విధంగా ముసుగులో గుద్దులాడుకోవడం కూడా సరికాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close