నితిన్‌కు ర‌ష్మిక స్వీట్ వార్నింగ్‌

`భీష్మ‌` ప్ర‌మోష‌న్లు ఊపందుకున్నాయి. ఎక్క‌డ చూసినా నితిన్ – ర‌ష్మిక‌లే క‌నిపిస్తున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి ఓ టీవీ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ బాగా వైర‌ల్ అయ్యింది. కార‌ణం.. ఆ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక‌కు సంబంధించిన ఓ టాప్ సీక్రెట్‌ని నితిన్ బ‌య‌ట‌పెట్ట‌డ‌మే. `ర‌ష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది.. అదే త‌న గ్లామ‌ర్ ర‌హ‌స్యం` అంటూ బాంబు పేల్చాడు నితిన్‌. దాన్ని ర‌ష్మిక కూడా ఒప్పుకుంది. ఓరోజు స‌ర‌దాగా కుక్క బిస్కెట్‌ని టేస్ట్ చేశాన‌ని, అలా.. ప్ర‌యోగాలు చేయ‌డం త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో బాగా వైర‌ల్ అయ్యింది. ర‌ష్మిక కుక్క బిస్కెట్లు తిన‌డం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

దానిపై ర‌ష్మిక మ‌ళ్లీ స్పందించింది. ”నేను కుక్క బిస్కెట్ ఏమీ తిన‌లేదు. జ‌స్ట్ టేస్ట్ చేశానంతే. పైగా నాకు అలా కొత్త రుచుల్నిచూడ‌డం ఓ స‌ర‌దా. నా సీక్రెట్ ని నితిన్ బ‌య‌ట‌పెట్టేశాడు. త‌న‌కు సంబంధించిన ఓ సీక్రెట్‌ని నేను కూడా త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తా..’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. భీష్మ క‌థ గురించి కూడా ర‌ష్మిక హింట్ ఇచ్చేసింది. ఇది ఆర్గానిక్ ఫార్మ‌సీ నేప‌థ్యంలో సాగే క‌థ అట‌. అయితే.. రైతు స‌మ‌స్య‌ల గురించి సీరియ‌స్‌గా చ‌ర్చించ‌లేద‌ని, సినిమా అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంద‌ని చెప్పుకొచ్చింది ర‌ష్మిక‌. ఈనెల 21న భీష్మ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com