ప‌వ‌న్‌తో పోలీస్ స్టోరీనా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఖాఖీ డ్ర‌స్సు అంత‌గా క‌లిసిరాలేదు. గుడుంబా శంక‌ర్‌లో కాసేపు ఖాకీ బ‌ట్ట‌ల‌తో క‌నిపించాడు ప‌వ‌న్‌. మొన్న‌టి స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌లోనూ పోలీసే. అదీ ప్లాప్‌. అయితే `గ‌బ్బ‌ర్ సింగ్‌` మాత్రం ఖాకీ క‌థ‌ల‌కు కొత్త క‌ల‌రింగు ఇచ్చింది. పోలీస్ క‌థ‌లు అన‌గానే… ఇప్ప‌టికీ గ‌బ్బ‌ర్ సింగ్‌ని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ప‌వ‌న్ – హ‌రీష్ శంక‌ర్ మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. ఇది వ‌ర‌కే ప‌వ‌న్ కోసం ఓ ప‌వ‌ర్‌ఫుల్ లైన్‌ని త‌యారు చేసుకున్నాడు హ‌రీష్‌. అయితే ఈసారీ ఇందులో ప‌వ‌న్ పోలీస్‌గానే క‌నిపించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. గ‌బ్బ‌ర్ సింగ్ హిందీ ద‌బాంగ్‌కి రీమేక్‌. అయితే హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌లో ద‌బాంగ్‌కి మించిన మ‌సాలా ఉంటుంది. అచ్చం అలాంటి క్యారెక్ట‌రైజేష‌న్‌తోనే హ‌రీష్ శంక‌ర్ ఓ క‌థ త‌యారు చేశాడ‌ని, అది ప‌వ‌న్‌కి కూడా న‌చ్చింద‌ని తెలుస్తోంది. పోలీస్ పాత్ర అన‌గానే గ‌బ్బ‌ర్ సింగ్‌తో పోలిక‌లు మొద‌లైపోతాయి. ఈ విష‌యంలోనే అటు ప‌వ‌న్, ఇటు హ‌రీష్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. గ‌బ్బ‌ర్ సింగ్‌తో పోల్చుకున్నా ఫ‌ర్వాలేద‌ని హ‌రీష్‌, ప‌వ‌న్‌లు భావిస్తే.. మ‌రో పోలీస్ స్టోరీని తెర‌పై చూసేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close