మీడియా వాచ్ : న్యూస్ చానల్స్‌కు రేటింగ్స్ షురూ !

రిపబ్లిక్ టీవీ చేసిన మ్యానిపులేటింగ్ కారణంగా న్యూస్ చానళ్లకు నిలిచిపోయిన బార్క్ రేటింగ్స్‌ను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో మళ్లీ రేటింగ్స్ ప్రకటించనున్నారు. రేటింగ్స్‌ను మ్యానిపులేట్ చేసిన కారణంగా బార్క్ మాజీ సీఈవో సహా 14 మంది అరెస్ట్ అయ్యారు. 14 నెలల కిందట రేటింగ్స్ ఆగిపోయాయి. తప్పుల్ని సరిదిద్ది మళ్లీ రేటింగ్స్‌ను ప్రారంభించాలని న్యూస్ చానళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం తక్షణమే రేటింగ్స్ పునరుద్ధరించాలని సమాచార, ప్రసార మంతృత్వ శాఖ ఈ రోజు బార్క్ ను ఆదేశించింది.

రేటింగ్ పద్దతిలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత మూడునెలల రేటింగ్స్‌ను కూడా నిజమైన ట్రెండ్ తెలిసేలా నాలుగు వారాల సగటు లెక్కించి ఇవ్వాలని ఆదేశించింది. సాధారణంగా శనివారం నుంచి శుక్రవారం వరకూ లెక్కించిన సమాచారాన్ని ఆ తరువాత వచ్చే గురువారం నాడు విడుదల చేస్తారు. ఆ విధంగా బార్క్ ప్రతి వారం అంతకు ముందు వారం రేటింగ్స్ ఇస్తుంది. ఇప్పుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాలుగువారాల సగటు మాత్రమే ఇవ్వాలి.

లెక్కించిన వారంతో బాటు అంతకు ముందు మూడు వారాల సమాచారాన్ని కూడా కలిపి నాలుగు వారాల సగటు మాత్రమే న్యూస్ చానల్స్ కు బార్క్ వెల్లడిస్తుంది. దీనివలన ట్రెండ్ తెలుస్తుంది. అనారోగ్యకరమైన ధోరణులను కొంత మేరకు అడ్డుకోవటానికి ఇది పనికొస్తుందని భావిస్తున్నారు. న్యూస్ చానల్స్ తోబాటు మ్యూజిక్, మూవీస్, కిడ్స్, స్పిరిచ్యువల్, స్పోర్ట్స్ ఇలా వివిధ కేటగిరీల చానళ్లకు విడిగా రేటింగ్‌లు ప్రకటిస్తారు. వాణిజ్యప్రకటలను ఆకర్షించడంలో ఈ రేటింగ్‌లే టీవీ చానళ్లకు కీలకం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close