రావ‌ణాసుర ట్రైల‌ర్‌: లా చ‌దివిన క్రిమిన‌ల్‌

”మ‌ర్డ‌ర్ చేయ‌డం క్రైమ్‌
దొర‌క్కుండా మ‌ర్డ‌ర్ చేయ‌డం ఆర్ట్‌
.. ఐ యామ్ ఏన్ ఆర్టిస్ట్ – రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ..”

– రావ‌ణాసుర ట్రైల‌ర్‌లో హీరో చెప్పిన‌ డైలాగ్ ఇది. దీన్ని బ‌ట్టి, ఈ సినిమాలో ర‌వితేజ క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఏప్రిల్ 7న విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ వ‌దిలారు.

126 సెక‌న్ల ట్రైల‌ర్ ఇది. యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వ‌యెలెన్స్‌, ఛేజులు, ట్విస్టులు, రొమాన్స్ ఇవ‌న్నీ ఈ ట్రైల‌ర్‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ర‌వితేజ మార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటూనే, ఓ కొత్త త‌ర‌హా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చూడ‌బోతున్నామన్న భ‌రోసా.. ఈ ట్రైల‌ర్‌తో క‌లిగిచింది చిత్ర‌బృందం. ఈ సినిమాలో ర‌వితేజ ఓ లాయ‌ర్‌. అయితే.. క్రైమ్ చేసేదీ త‌నే, ఆ కేసుని వాదించేదీ త‌నే. ఇదే.. ఈ క్యారెక్ట‌రైజేష‌న్‌లో ఉండే వెరైటీ.

”వాడు క్రిమిన‌ల్ లాయ‌ర్ కాదు.. లా చ‌దివిన క్రిమినల్” అనే డైలాగ్‌తో హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ని ప్ర‌జెంట్ చేశారు. జ‌య‌రామ్‌, ముర‌శీ శ‌ర్మ‌, సుమంత్ ఇలా కాస్టింగ్ బ‌లంగానే ఉంది. దానికి తోడు హైప‌ర్ ఆది పంచ్‌లు తోడయ్యాయి. ఈ సినిమాలో న‌లుగురు క‌థానాయిక‌లున్నారు. వాళ్ల‌కీ ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు ద‌క్కిన‌ట్టే అనిపిస్తోంది. మేకింగ్‌, నేప‌థ్య సంగీతం.. ఇవ‌న్నీ బాగానే క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల ధ‌మాకాతో ఓ హిట్టు అందుకొన్న ర‌వితేజ ఆ ఫామ్ ని ఈ సినిమాతోనూ కంటిన్యూ చేయాల‌నుకొంటున్నాడు. ట్రైల‌ర్‌లో మాత్రం విష‌యం ఉంది. మ‌రి సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.