రవితేజ, దిల్ రాజు సినిమా ఆగిపోయిందా..!

మాస్ మహరాజ్ రవితేజకు అసలు టైం కలిసిరావట్లేదు. తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంత సందడి చేయకపోగా పరిశ్రమలోని వ్యక్తులతో గొడవలు కాస్త ఇబ్బందిపెడుతున్నాయని తెలుస్తుంది. అసలైతే దిల్ రాజు సినిమా ఎవడో ఒకడు సినిమా షూటింగ్ లో ఉండాల్సిన రవితేజ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు. దిల్ రాజు రవితేజల మధ్య రెమ్యునరేషన్ గొడవ చివరకు సినిమా వదులుకునేలా చేసిందని అంటున్నారు. కిక్-2 ఫ్లాప్ తర్వాత దిల్ రాజు సినిమా ఒప్పుకున్న రవితేజ బెంగాల్ టైగర్ ఎలాగు యావరేజ్ గా ఆడింది కాబట్టి ఎప్పుడు తీసుకునే 8 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట.

కాని దిల్ రాజు మాత్రం అందుకు ససేమీరా ఒప్పుకోలేదట.. 6 కోట్లు తీసుకుని సినిమా చేయమన్నాడట అయితే ఒక్కసారి తగ్గితే ఇక తగ్గుతూనే ఉండాలనే ఆలోచనతో సినిమా అయినా వదులుకుంటాను కాని రెమ్యునరేషన్ తగ్గేది లేదు అని చెప్పి సినిమా వదిలేశాడని ఫిల్మ్ నగర్ టాక్. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందించబడే ఈ సినిమాకు ఎవడో ఒకడు టైటిల్ కూడా నిర్ణయించడం జరిగింది.

ఇక రవితేజ ఎలాగు కాదన్నాడు కాబట్టి ఆ సినిమా సబ్జెక్ట్ కు తగిన హీరో కోసం వెతుకుతున్నారట దర్శక నిర్మాతలు. మరి రవితేజ కాదన్న కథనుకున్న సినిమా ఏ హీరో టేకప్ చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com