మీడియాకు మాఫియాకు మధ్య పోరాటం..!: రవిప్రకాష్

ఏబీసీఎల్ కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపారు. మధ్యాహ్నం సమయంలో హఠాత్తుగా… సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రవిప్రకాష్‌ను పోలీసులు విచారించారు. ఫోర్జరీ కేసు… సోదాల్లో తాము స్వాధీనం చేసుకున్న ఆధారాలు… ఇతర అంశాలను ముందు పెట్టి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేయాలనుకుంటే… రెండురోజుల ముందు నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో… పోలీసులు అరెస్ట్ లాంటి నిర్ణయం తీసుకోలేదు. రవిప్రకాష్‌ను మళ్లీ ఎప్పుడు రమ్మన్నారో క్లారిటీ లేదు.

విచారణ ముగిసిన తర్వాత రవిప్రకాష్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన ధనిక వ్యాపారస్తులు… తనను మోసం చేసి.. అక్రమంగా టీవీ9ని కొనుగోలు చేశారని.. ఆ వివరాలన్నీ బయటకు రాకుండానే…. తనపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పోరాటాన్ని మీడియాకు.. మాఫియాకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. మూడు రకాల మాఫియాలు.. మీడియాను గుప్పిట్లో పెట్టుకుని వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతిమంగా.. మీడియానే విజయం సాధిస్తుందని.. తన చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతానని ప్రకటించారు. చివరికి సత్యమే విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. నైతికంగా మద్దతిస్తున్న అందరికీ.. ధన్యవాదాలు చెప్పారు. కొంత మంది పోలీసులు కూడా.. తనకు సాయం చేయడానికి ముందుకు వచ్చారని.. హైదరాబాద్‌లో ఇలాంటి అవ్యవస్థ ఉండటానికి వీల్లేదని.. వారన్నారని… రవిప్రకాష్ చెబుతున్నారు. సమాజహితం కోసం.. చివరి వరకూ పోరాడతానన్నారు. తనను ఒక్కడ్నే చేసి… వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని వేధిస్తున్నారన్నారు. ఈ పోరాటంలో అంతిమ విజయం దక్కుతుందన్నారు.

రవిప్రకాష్‌ హఠాత్తుగా..విచారణకు హాజరు కావడంతో… సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపలేకపోయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు…మరోసారి విచారణకు పిలిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున.. విచారణకు సహకరిస్తున్నందున.. అరెస్ట్ చేసే అవకాశాలు కూడా తక్కువేనని చెబుతున్నారు. ఈ విషయంలో.. రెండు, మూడు రోజుల్లో మరికొన్నికీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close