“టీవీ9” కోసం రవిప్రకాష్ మరో న్యాయపోరాటం..!

టీవీ9 వ్యవస్థాపకుడు రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం గెంటేసి.. కేసుల పేరుతో వేధింపులు ప్రారంభించినప్పటికీ.. ఆ సంస్థపై ఆయన మమకారాన్ని వదులుకోవడంలేదు. తాను ఉన్నప్పుడు గొప్పగా లాభాలు ఆర్జిస్తున్న ఆ సంస్థ ఇప్పుడు అప్పుల్లోకి పోయిందని.. కొన్ని చానళ్లను కూడా మూసేసిందని.. షేర్ వాల్యూ కూడా అత్యంత దారుణంగా పడిపోయిందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పిటిషన్ దాఖలు చేశారు. షేర్ వాల్యూ ప్రకారం.. తాను ఆ సంస్థ మొత్తం వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఆ పిటిషన్‌లోని అసలు ట్విస్ట్. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

టీవీ9 కొత్త యాజమాన్యంలోకి మారిన తర్వాత వరుసగా నష్టాలను ప్రకటిస్తోంది. వడ్డీలు, తరగు, పన్నులు లాంటివి తీసివేయక ముందు గతంలో రూ. 30 కోట్ల వరకూ లాభం వచ్చేది. ప్రస్తుతం ఆ రూ. 30 కోట్ల లాభం ఆవిరి అయిపోవడమే కాదు రూ. 43 కోట్ల నష్టాల్లోకి జారిపోయింది. అంతే కాదు.. మరో నాలుగేళ్ల పాటు నష్టాలు ఉంటాయని సంస్థ అంచనా వేసింది. పైగా ఏ కంపెనీకి అయినా షేర్ ధర కీలకం. షేర్ ధర నిరంతరాయంగా పడిపోతూ ఉంటే.. ఆ సంస్థ భవిష్యత్‌పై మార్కెట్‌లో నమ్మకం పోతోందని అర్థం . ప్రస్తుతం టీవీ9 గ్రూప్ పరిస్థితి కూడా అంతే ఉంది. షేర్ వ్యాల్యూ ఏడాది కాలంలోనే 270 రూపాయల నుంచి 78 రూపాయలకు పడిపోయింది. రవిప్రకాష్.. వీటన్నింటినీ ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

విజయవంతంగా నడుస్తూ లాభాలు ఆర్జించటమే కాకుండా పెద్ద ఎత్తున పన్నులు చెల్లిస్తున్న కంపెనీ నష్టాల్లోకి వెళ్ళటం ప్రస్తుత యాజమాన్యం వైఫల్యమేనన్నారు. అంతే కాక… నిబంధనలను సైతం ప్రస్తుత యాజమాన్యం ఉల్లంఘిస్తోందని రవిప్రకాష్ చెబుతున్నారు. ప్రస్తుతం యజమాన్య వ్యవహారాలు చూస్తున్న అలంద మీడియా వివిధ కోర్టుల్లో కేసులు ఉండగానే టీవీ1, న్యూస్ 9 ఛానళ్లను మూసివేసిందని రవిప్రకాష్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 78.32 రూపాయల షేర్ ధర వద్ద మెజారిటీ వాటా కొనుగోలుకు తనను అనుమతించాలని రవిప్రకాష్ కోరుతున్నారు.

రవిప్రకాష్‌కు ఇలాంటి పిటిషన్ వేయడానికి అర్హత ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆయన సంస్థలో ఇప్పటికీ మైనర్ వాటాదారుడే. దాదాపుగా 9 శాతం వాటా ఉందని చెబుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో సంస్థ నడిచినప్పుడు… మంచి లాభాలు… నెట్ వర్త్ పెంచుకున్న సంస్థ ఇప్పుడు … పతనం దశలో ఉండటంతో..మళ్లీ దారిలో పెట్టుకునేందుకు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. కొత్త యాజమాన్యం అంగీకారం లేకుండా.. టీవీ9 అమ్మకం అనేది సాధ్యం కాదు. టీవీ9ని కొత్త యాజమాన్యం తమ వ్యాపార అవసరాలకు అండగా ఉంటుందనే కొనుగోలు చేసి ఉంటారు కానీ… లాభాల కోసం కాదని.. చాలా కాలంగా చెప్పుకుంటున్నారు. ఈ కోణంలో చూస్తే వారు నష్టాలను భరించడానికి సిద్ధంగా ఉంటారు కానీ .. ఆ చానల్‌ను వదలబోరని అంటున్నారు. అయితే టీవీ9 యాజమాన్య వివాదంపై ఇప్పటికే ఎన్సీఎల్టీలో కొన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close