కోదండరాంపై టీఆర్ఎస్ పోటీ పెడుతుందా..?

దుబ్బాక ఉప ఎన్నిక తో పాటు గ్రాడ్యుయేట్ కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే ఉపఎన్నిక బరిలో నిలవడంలో ఎలాంటి సందేహం లేదు కానీ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల‌ విషయంలో మాత్రం భిన్నమైన చర్చ నడుస్తోంది. నల్గొండ-ఖ‌మ్మం-వ‌రంగ‌ల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోపాటు మ‌హ‌బూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైద్ర‌బాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జరగనున్నాయి. ఇంతకుముందు గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ మంచి ఫలితాలు రాలేదు. 2015లో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. కానీ మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ కోటాలో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ఓడిపోయారు.

కానీ ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ రెండు స్థానాలు గెల‌వాల‌ని పట్టుదలతో టీఆర్‌ఎస్‌ ఉంది. ఈ సారి టీజేఎస్ నేత కోదండరాం బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే మరింతగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లందరూ గ్రాడ్యుయేట్లు కావడంతో నిరుద్యోగ భృతి హామీని తేల్చాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని ఎమ్మెల్యేలు కోరుతున్నట్టు తెలుస్తోంది. అటు ఇదే అంశాన్ని నినాదంగా తీసుకోవాలనే యోచనలో విపక్షాలు ఉన్నాయి. అందుకే నోటిఫికేషన్‌కు ముందే నిరుద్యోగ భృతి ప్రకటించాలనే అభిప్రాయాన్ని టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్‌ఎస్‌లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. ఓటర్ల నమోదు తర్వాత అభ్యర్థులను ఖరారు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. కోదండరాం పోటీ చేసి.. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెడితే.. ప్రజల్లో వేరే రకమైన ప్రచారం జరుగుతుందన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లో ఉంది. అందుకే.. కోదండరాం అభ్యర్థిత్వాన్ని బట్టి వ్యూహం ఖరారు చేసుకోవాలనుకుంటున్నారు. అయితే.. పార్టీ సానుభూతిపరులను ఓటర్లుగా చేర్చేందుకు మాత్రం ప్రత్యేకంగా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close