వైఎస్ఆర్, జగన్ పాలనకు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా : కొండా సురేఖ

రాజన్న పాలన తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉంటారు. తీసుకొచ్చేశారని వైసీపీ నేతలు అప్పుడప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ నిఖార్సైన ఫీడ్ బ్యాక్ మాత్రం అప్పుడప్పుడు.. ఆత్మీయులైన వారి దగ్గర్నుంచే బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి ఫీడ్ బ్యాక్.. కొండా సురేఖ వద్ద నుంచి ఏపీ ప్రభుత్వానికి అందింది. అదేమిటంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు.. జగన్మోహన్ రెడ్డి పాలనకు.. భూమికి.. ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని. ఓ సారి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ ఆందర్నీ సమానంగా చూస్తారని.. కానీ జగన్ మాత్రం.. కక్షలు తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగిస్తున్నారనేది కొండా సురేఖ విశ్లేషణ. అందరూ ఇదే అంటున్నారు కానీ.. కొండా సురేఖ చెప్పడం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు వీర విధేయులు కొండా దంపతులు.

తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా కొండా దంపతులు జగన్మోహన్ రెడ్డిని విడిచి పెట్టలేదు. ఆ ఊపులో ఓడిపోతామని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసి పరకాల ఉపఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో తీవ్రంగా పోరాడారు. చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా ఆ తర్వాత జగన్ ను వదిలి పెట్టలేదు. కానీ ఆ తర్వాత జగన్ పట్టించుకోకపోవడంతో తమ దారి తాము చూసుకున్నారు. అప్పట్నుంచి వైఎస్ తో పోల్చి.. జగన్‌కు అసలు పోలికలే లేవని చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం పాలన విషయంలోనూ..,వైఎస్‌తో అసలు జగన్‌కే పోలికే లేదని… చెబుతున్నారు. కేసీఆర్ డబ్బులతోనే జగన్ గెలిచారని కొండా సురేఖ అంటున్నారు. వెయ్యి కోట్లు పంపించారనేది ప్రచారమే కానీ.. ఎంత పంపారనేది కాదు.. ఖచ్చితంగా పంపించారని మాత్రం ఆమె అంటున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే కాదు.. ఎవరు అధికారంలోకి వచ్చినా కక్ష సాధింపుల కోసం అధికారాన్ని వాడుకునే ప్రయత్నం చేయరు. చేసినా అది చాలా పరిమితంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎకైక అజెండా అధికారం అందింది కాబట్టి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం అన్నట్లుగా మారిపోయింది. ఓటు బ్యాంక్‌ను సంతృప్తి పరచడానికి ప్రజలకు పథకాల రూపంలో ఎంతో కొంత నగదు బదిలీ చేయడం.. ఆ తర్వాత ఇష్టం లేని వారిపై దండయాత్ర చేయడం.. కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో చట్టాలను ఉల్లంఘిస్తున్నారని కోర్టుల్లో మొట్టికాయలు పడుతున్నా… వెనక్కి తగ్గని పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ హయాంలో ఎన్నికల వరకే రాజకీయాలు.. మిగతా రోజుల్లో అందర్నీ సమానంగానే చూసేవారని కొండు సురేఖ లాంటి వాళ్లు చెబుతూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close