రవి ప్రకాష్ గారూ, హవాలా డబ్బులతో పెట్టిన ఛానల్ నడుపుతూ ఇంతకాలం మాకు నీతులు చెప్పారా?

– కట్నం తీసుకునేవాడు గాడిద
– ఓటుకు నోటు తీసుకున్న వాడు శునకం
– ఫ్యాక్షనిస్టుల ఆస్తులు జాతీయం చేయాలి
– కులం పేరుతో సినిమా హీరోలను అభిమానించడం పనికిమాలిన చర్య

అబ్బో, ఇలాంటి చాలా నీతులు టీవీ9 ఛానల్ లో ప్రజలకు ప్రబోధించారు. పైన చెప్పినవి కొన్ని మాత్రమే, ఇలాంటి చాలా చాలా నీతులు మరెన్నో ప్రజలకు ప్రబోధించిన టీవీ9 పుట్టిందే హవాలా మార్గంలో అని, దేశద్రోహం తో సమానమైన ఆర్థిక ఉగ్రవాద చర్య లాంటి హవాలా స్కామ్ లతో తాము ఈ ఛానల్ పెట్టాము అని స్వయంగా రవిప్రకాష్ నేరుగా కోర్టుకు తెలియజేయడం, ఇప్పుడు మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించడమే కాకుండా, ఇంతకాలం ఆ నీతులు చెప్పించుకున్న ప్రజల ని కూడా ఈ వార్త విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే..

టీవీ9 పుట్టుక- (దేశద్రోహం తో సమానమైన) హవాలా మార్గంలో జరిగిందన్న రవి ప్రకాష్:

టీవీ9 దాదాపు రెండు దశాబ్దాల కిందట ప్రారంభమైంది. అయితే అప్పుడు ఛానల్ ఏర్పాటు చేసే సమయం లో వచ్చిన నిధులు ఫెమా ( ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ ఆక్ట్) ని ఉల్లంఘించి కొంతమంది బడాబాబులు హవాలా మార్గంలో దేశంలోని కి తీసుకు వచ్చారని, ఆ డబ్బులను టీవీ9 ఏర్పాటు చేయడానికి పెట్టుబడిగా పెట్టారని, స్వయంగా ఆ చానల్ మాజీ సీఈఓ రవి ప్రకాష్ నేరుగా కోర్టు ముందు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యాఖ్యలు ఇంకెవరైనా చేసి ఉంటే అంత విశ్వసనీయత వచ్చి ఉండేది కాదేమో కానీ, ఆ ఛానల్ ఏర్పాటు సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన, ఆ ఛానల్ లో ఇప్పటికీ 10 శాతం వాటా కలిగిన రవి ప్రకాష్ నుండి స్వయంగా రావడం వల్ల ఈ వ్యాఖ్యకు ఎంతగానో విశ్వసనీయత వచ్చింది. ఈ లెక్కన, టీవీ9 పెట్టింది ఖచ్చితంగా అవినీతి సొమ్ముతో నేనని, దేశ చట్టాలను ఉల్లంఘించి, దేశంలోని కి హవాలా మార్గంలో తరలించిన సొమ్ముతో నేనని ప్రజలందరూ విశ్వసించే పరిస్థితి ఏర్పడింది.

రవి ప్రకాష్ వ్యవహారం, దోపిడీ సొమ్ము పంచుకోవడంలో గొడవ పడ్డ దొంగలను తలపిస్తోందా?

రవి ప్రకాష్ ఇప్పుడు కూడా చాలా నీతులు చెబుతున్నాడు. మీడియా కెమెరాలు కనిపించగానే ఈ పోరాటం, జర్నలిస్టు సమాజానికి, పెట్టుబడిదారులకు మధ్య జరుగుతున్న పోరాటం అని అంటున్నారు. ధనిక స్వామ్యానికి మీడియా కి మధ్య జరుగుతున్న పోరాటం అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఇన్ని నీతులు చెబుతున్న రవిప్రకాష్ ఇంతకాలం అవినీతి సొమ్ముతో, దేశద్రోహం తో సమానమైన హవాలా సొమ్ములతో పెట్టిన ఛానల్ ని తాను ముందుండి, దగ్గరుండి నడిపించాను అని తానే ఒప్పుకున్నారు అన్నమాట. అవినీతి డబ్బులతో తాము ఈ ఛానల్ పెట్టామని తనకు తెలిసి కూడా, సమాజంలోని అవినీతిని పారద్రోలుతామని బీరాలు పలికారు అన్నమాట. తాము దేశద్రోహం తో సమానమైన ( ఫెమా ఉల్లంఘన) పనులు చేసినప్పటికీ, తమ చానల్ తరపున, 500, 600 లంచాలు తీసుకున్న ( మొదట్లో) విఆర్ఓ ల మీద స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించారు అన్నమాట.

ఇంతకాలం జనాలకు చెప్పిన నీతుల సంగతి ఏంటి?

కట్నం తీసుకునేవాడు గాడిద, ఓటుకు నోటు తీసుకున్నవాడు శునకం, కులం పేరుతో హీరోలను అభిమానించేవాడు పనికిమాలినవాడు, లాంటి అనేక స్లోగన్ లను పాపులర్ చేసిన రవి ప్రకాష్ లాంటి మేధావులు, హవాలా మార్గంలో వచ్చిన డబ్బులతో పెట్టిన సంస్థలను నడిపే వారిని ఏమంటారో కూడా చెబితే బాగుంటుందేమో. తనకు తన పదవికి ఢోకా లేనంత కాలం, ఎలాంటి ( అవినీతి డబ్బులు కానీ, దొంగతనంగా తెచ్చిన డబ్బులు కానీ, హవాలా డబ్బులు కానీ) డబ్బులతో పెట్టిన సంస్థని అయినా తాను నడుపుతానని, తన పదవికి ఇబ్బంది వస్తే మాత్రం , తాను మునిగి పోయే పరిస్థితి ఏర్పడితే తనతో పాటు మిగిలిన వాళ్లందరినీ ముంచుతా అన్నట్టుగా ప్రవర్తించే వారిని ఏమంటారో కూడా రవిప్రకాష్ లాంటి మేధావులు చెబితే బాగుంటుంది అని జనం భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close