ర‌వితేజ మ‌రోటి మొద‌లెట్టేస్తున్నాడు

ర‌వితేజ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ఖిలాడీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. `రామారావు` సెట్స్‌పై ఉంది. ఈలోగా మ‌రో సినిమా మొద‌లెట్టేస్తున్నాడు. త్రినాథ‌రావు న‌క్కిన‌తో ఓ సినిమా ఎప్పుడో ఒప్పుకున్నాడు ర‌వితేజ. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా మొద‌లు కాబోతోంది. సోమవారం హైద‌రాబాద్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. అభిషేక్ అగ‌ర్వాల్, టీజీ విశ్వ ప్ర‌సాద్‌ ఈ చిత్రానికి నిర్మాత‌లు.

త్రినాథ‌రావుది కామెడీ మార్క్‌. గ‌త సినిమాలన్నీ అలానే సాగాయి. ఈసారి కూడా మంచి ఎంట‌ర్‌టైన‌ర్ ని సిద్ధం చేశారు. రామ్ తో `హ‌లో గురూ ప్రేమ కోస‌మే` త‌ర‌వాత త్రినాథ‌రావు చేస్తున్న సినిమా ఇదే. 2018లో విడుద‌లైన చిత్ర‌మిది. అంటే మూడేళ్లు గ్యాప్ వ‌చ్చింద‌న్న‌మాట‌. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు ప్ర‌స‌న్న‌కుమార్ అందించారు. భీమ్స్ సంగీత ద‌ర్శ‌కుడు. క‌థానాయిక‌, ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close