రైట‌ర్‌కి ఛాన్స్ ఇచ్చిన ర‌వితేజ‌?

ఈమ‌ధ్య ర‌వితేజ సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ఓ కామన్ పేరు క‌నిపిస్తోంది. త‌నే… శ్రీ‌కాంత్ విస్సా. ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న అన్ని సినిమాల‌కూ త‌నే ర‌చ‌యిత‌. శ్రీ‌కాంత్ ప‌నితీరు, రైటింగ్ స్కిల్స్ ర‌వితేజ‌ని బాగా ఆక‌ట్టుకొన్నాయి. అందుకే శ్రీ‌కాంత్ రెడీ చేసిన రెండు క‌థ‌ల్ని.. ర‌వితేజ కొనేసి, వాటిని సినిమాలుగా చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీ‌కాంత్ విస్సా చేతికి మెగా ఫోన్ కూడా అప్ప‌జెప్ప‌బోతున్నాడ‌ని టాక్‌. అవును.. శ్రీ‌కాంత్ విస్సా ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఆ క‌థ‌కు సంబంధించిన చ‌ర్చ‌లు వాడీ వేడీగా జ‌రుగుతున్నాయి. ర‌వితేజ చేతిలో బ‌ల‌మైన లైన‌ప్ ఉంది. ఒక‌దాని త‌ర‌వాత మ‌రోటి గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ప‌నిలో ప‌నిగా శ్రీ‌కాంత్ కీ డేట్లు ఇచ్చేయాల‌ని ర‌వితేజ ఫిక్స‌య్యాడ‌ని టాక్‌. త‌న సొంత బ్యాన‌ర్‌ ఆర్‌.టీ క్రియేటీవ్‌వ‌ర్క్స్ సంస్థ‌లోనే ఈ సినిమాని నిర్మించే అవ‌కాశాలున్నాయి. చాలామంది రైట‌ర్లు ద‌ర్శ‌కులుగా అవ‌తారం ఎత్తారు. అయితే… వాళ్లెవ్వ‌రితోనూ ర‌వితేజ ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ని చేయ‌లేదు. తొలిసారి… ఓ రైట‌ర్ కి ఛాన్సిచ్చి, డైరెక్ట‌ర్ని చేస్తున్నాడు ర‌వితేజ. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కులాల లెక్కలేసుకుంటే జనసేనకు 40 సీట్లొచ్చేవి : పవన్

కుల , మతాలు లేని రాజకీయం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ఈ సందర్భంగా కుల, మతాల...

‘స‌లార్’ అప్‌డేట్‌: రిలీజ్ డేట్ ఫిక్స్‌

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో.. ఎదురుచూస్తున్న అప్ డేట్ వ‌చ్చేసింది. 'స‌లార్‌' రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ...

బింబిసార విజయ రహస్యం ఇదేనా?

కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గిపోయిందనే మాట సర్వాత్ర వినిపిస్తోంది. దీనికి కారణం ఓటీటీ ప్రభావమని కొందరంటే.. సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచి మళ్ళీ తగ్గించి ప్రేక్షకుడికి...

‘బింబిసార‌’… సీక్వెల్ కాదు ప్రీక్వెల్‌

బింబిసార ఫ‌లితంతో సంబంధం లేకుండా బింబిసార 2 తీస్తామ‌ని చిత్ర‌బృందం ముందే ప్ర‌క‌టించింది. ఇప్పుడు బింబిసార అనూహ్య‌మైన విజ‌యాన్ని అందుకొంది. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close