ఖిలాడీతో.. యాక్ష‌న్ కింగ్ ఢీ

ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌చిత్రం `ఖిలాడీ`. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. చిన్న టీజ‌ర్ ని కూడా వ‌దిలారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని మే 28న విడుద‌ల చేయ‌నున్నారు. అన్న‌ట్టు… ఈ సినిమాలో ర‌వితేజ‌ని ఢీ కొట్టే పాత్ర‌లో యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టించ‌బోతున్నాడు. `ఖిలాడీ`లో ప్ర‌తినాయ‌కుడు ఆయ‌నే. ఈ విష‌యాన్ని అర్జున్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా త‌న అభిమానుల‌కు తెలియ‌జేశారు. ఇటీవ‌ల అర్జున్‌కి తెలుగులో మంచి పాత్ర‌లే ద‌క్కుతున్నాయి. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`లో అల్లు అర్జున్ కి తండ్రి గా న‌టించాడు అర్జున్‌. ఇప్పుడు ర‌వితేజ‌ని ఢీ కొట్ట‌బోతున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే అర్జున్ `ఖిలాడీ` సెట్స్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు,...

పులివెందుల బాధ్యతలు భారతికి ఇచ్చిన జగన్ !

పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం...

జక్క‌న్న‌కు అంత టైమ్ ఉందా?

రాజ‌మౌళి ఈమ‌ధ్య బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఫంక్ష‌న్ల‌లో మెర‌వ‌డం చాలా త‌క్కువ‌. సినిమా వేడుక‌ల్లో చూడ‌డం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. త‌న టైమ్ అంతా మ‌హేష్ బాబు సినిమా కోస‌మే....

శ్రీ‌నువైట్ల‌… రూటు మార్చేశాడా?

కామెడీని పండించ‌డంలో శ్రీ‌నువైట్ల‌ది సెప‌రేట్ స్కూల్‌. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ గుర్తింపు వ‌చ్చింది ఎంట‌ర్‌టైన్మెంట్ సినిమాల వ‌ల్లే. 'దూకుడు' లాంటి ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన రికార్డ్ శ్రీ‌నువైట్ల‌కు ఉంది. అయితే... కొంత‌కాలంగా వైట్ల‌కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close