అటు ప్రవీణ్ ప్రకాష్.. ఇటు నిమ్మగడ్డ మధ్యలో సీఎస్..!

ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేయడానికి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ సంశయిస్తున్నారు. ఎస్ఈసీ ఆదేశాలను ఆయన అమలు చేయలేదు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో ఘాటు లేఖ రాశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. తాజా లేఖలో ప్రవీణ్ ప్రకాష్ తాను స్వయంగా తప్పు చేశాడని అంగీకరించారని గుర్తు చేశారు. జనవరి 23వ తేదీన ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. దానికి సీఎస్, డీజీపీనే కాదు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు హాజరు కాలేదు. దీనికి కారణం ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలివ్వడమేనని నిమ్మగడ్డకు తెలిసింది.

దీన్నే కారణమంగా చెబుతూ… ప్రవీణ్ ప్రకాష్ తప్పిదానికి పాల్పడ్డారని.. ఆయన అధికారుల్ని నియంత్రించడం వల్ల మొదటి దశ ఎన్నికలను రీ-షెడ్యూల్ చేయాల్సి వచ్చిందని రమేష్ కుమార్ చెప్పారు. ఎస్ఈసీ లేఖ సీఎస్‌కు అందిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ కూడా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఓలేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు జరిపానని.. తానెక్కడా తప్పు చేయలేదన్నారు. ఈ మాటతోనే అధికారుల్ని సమావేశానికి రాకుండా ఆపిన విషయాన్ని ఆయన అంగీకరించాల్సి వచ్చింది. దీన్నే నిమ్మగడ్డ తన తాజా లేఖలో వివరించి.. చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయకపోతే కోర్ట్ ధిక్కరణ అవుతుందని గుర్తుచేశారు.

మరో వైపు ఎన్నికల కోడ్ అమలు విషయంలోనూ మరో లేఖను ఎస్ఈసీకి పంపారు. ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో నేతలెవరూ అధికారిక వాహనాల్లో తిరగొద్దని వారి వెంట అధికారులు వెళ్లవద్దని ఆదేశించారు. సజ్జల అదే పనిగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తూండటంతో.. ఆయనపైనా కోడ్ ప్రయోగించారు నిమ్మగడ్డ. కేబినెట్ ర్యాంక్ లో ఉన్న ప్రభుత్వ సలహాదారులు పార్టీ ఆఫీసుల్లో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి తమ పార్టీ తరపున మాట్లాడకూడదని అలా చేస్తే 1994 పంచాయతీరాజ్ చట్టం, 1951 ప్రజా ప్రాతినిధ్యం చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టేనన్నారు. నిమ్మగడ్డ నుంచి వచ్చి పడుతున్న లేఖలు అధికార పార్టీని చికాకు పెడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close