సీక్వెల్స్ కి ‘సై’ అన్న ర‌వితేజ‌!

సీక్వెల్ ఓ విజ‌య సూత్రం. విజ‌య‌వంత‌మైన సినిమాని కొన‌సాగించ‌డం మామూలు విష‌యం కాదు. అంచ‌నాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకున్న సినిమాలూ త‌క్కువే. కాక‌పోతే… సీక్వెల్ అన‌గానే మార్కెట్ మొద‌లైపోతుంది. ఆ కాంబినేష‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో.. బిజినెస్ భారీగా జ‌రుగుతుంది. అది.. క‌చ్చితంగా ప్ల‌స్ పాయింటే. కాబ‌ట్టే సీక్వెల్స్ ప‌ల్టీ కొడుతున్నా – వ‌స్తూనే ఉంటాయి.

ర‌వితేజ `కిక్‌` కి సీక్వెల్‌గా `కిక్ 2` వ‌చ్చింది. ఆసినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయినా స‌రే.. సీక్వెల్స్‌కి సై అంటున్నాడు మాస్ మ‌హారాజా. ఇటీవ‌ల విడుద‌లైన `క్రాక్‌`కి సీక్వెల్ వ‌స్తుంద‌ని.. ఆ సినిమా చివ‌ర్లో సూచ‌న ప్రాయంగా చెప్పేసింది చిత్ర‌బృందం. ఈ సినిమా సీక్వెల్ చేయ‌డానికి ర‌వితేజ కూడా రెడీగానే ఉన్నాడు. క్రాక్ జ‌రుగుతున్న‌ప్పుడే సీక్వెల్ చేద్దాం.. అని గోపీచంద్ మ‌లినేనికి చెప్పాడ‌ట ర‌వితేజ‌. అందుకే…. ఆ ధైర్యంతోనే క్లైమాక్స్ లో `క్రాక్ 2` వ‌స్తోంద‌ని చెప్ప‌గ‌లిగాడు. ర‌వితేజ దృష్టి మ‌రో సినిమాపై కూడా ఉంది. అదే… `రాజా ది గ్రేట్`. అనిల్ రావిపూడి న‌టించిన ఈసినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కి త‌గిన క‌థ అనిల్ రావిపూడి ద‌గ్గ‌ర రెడీగా ఉంది. “రాజా ది గ్రేట్ సీక్వెల్ చేద్దామ‌ని అనిల్ నాతో చెప్పాడు. ఓ లైన్ కూడా వినిపించాడు. అది చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది“ అని చెప్పుకొచ్చాడు ర‌వితేజ‌. సో… ర‌వితేజ నుంచి ఈ రెండు సీక్వెల్స్ రావ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీం చెప్పినా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వెంకట్రామిరెడ్డి..!

ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి .. ఎస్ఈసీ నిమ్మగడ్డను చంపే హక్కు కూడా ఉందన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తన మాటలు వక్రీకరించారని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మరింత వివాదాస్పదమైన...

వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్...

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

HOT NEWS

[X] Close
[X] Close