రాయపాటి బీజేపీలో చేరక తప్పదా..?

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు..  భారతీయ జనతా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు.. అన్నింటికీ మించి పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో… తనకు.. ఎక్కడ లేని చిక్కులు ఎదురవుతున్న సందర్భంలో.. అంతకు మించిన దారి తనకు లేదని.. ఆయన కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాయపాటి కుటుంబం కాస్త సుముఖంగా ఉండటంతో..  గత ఆదివారం.. గుంటూరు వచ్చిన.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్..  వాళ్లింటికెళ్లి చర్చించారు. దాదాపుగా రెండు గంటల పాటు.. వారి మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా పార్టీ మారితే.. రాయపాటికి వచ్చే లాభాల గురించి వివరించినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి రాజకీయ భవిష్యత్‌ను కూడా.. భరోసా ఇస్తామని బీజేపీ హమీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ భేటీ విషయాన్ని.. రాయపాటి సాంబశివరావు..  టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. పార్టీ మారక తప్పని పరిస్థితులు ఉన్నాయని.. ఆయన నేరుగా చంద్రబాబుకే చెప్పినట్లు తెలుస్తోంది.  రాయపాటి స్పందనను బట్టి చూస్తే.. రెండు, మూడు రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ అగ్రనేతలతో సమావేశమవుతారని చెబుతున్నారు. పోలవరం కాంట్రాక్ట్‌ను.. రద్దు చేసే యోచనలో.. ఏపీ సర్కార్ ఉంది. అది జాతీయ  ప్రాజెక్ట్ కావడంతో.. కేంద్రం అనుమతి తప్పనిసరి. పనులు చేయలేక.. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ చేతులెత్తేయడంతో…  సబ్ కాంట్రాక్టర్లతో పనులు నిర్వహిస్తున్నారు. అయితే అధికారికంగా కాంట్రాక్ట్ మాత్రం ట్రాన్స్ ట్రాయ్ పేరు మీదనే ఉంది. దీనికి సంబంధించి ఆ సంస్థకు వచ్చే ప్రయోజనాలు ఆ సంస్థకు వస్తున్నాయి. పైగా కాంట్రాక్ట్ రద్దు చేస్తే అనేక ఆర్థిక సమస్యలు వస్తాయి. వీటన్నింటినీ తట్టుకోవడం కష్టమని.. రాయపాటి కుటుంబం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాయపాటి సాంబశివరావు మొన్నటి ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు రాయపాటి రంగారావు కూడా.. టిక్కెట్ ఆశించారు. అయితే.. దక్కలేదు. అయినప్పటికీ.. టీడీపీకి అనుకూలంగానే ఉన్నారు. అయితే.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్… ప్రభావం…. వ్యాపారవేత్తగా ప్రయోజనాలు కాపాడుకోవడానికి బీజేపీలోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోందన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. అయితే.. రాయపాటి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఎవరినైనా శత్రువుగా భావిస్తారా.. అంటే.. ఒక్క కన్నా లక్ష్మినారాయణనే.. ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండగా…  రాయపాటి.. ఆ పార్టీలో చేరుతారా.. అన్నది ఆసక్తికరం. తమ పార్టీ ఏపీ అధ్యక్షుడికి బద్దశత్రువైన రాయపాటిని ఇంటికి వెళ్లి మరీ.. పార్టీలోకి ఆహ్వానించడంలో… బీజేపీ పెద్దల రాజకీయం… కన్నాకు పొగపెట్టడమేనన్న చర్చ కూడా సాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close