షాకిచ్చిన శంక‌ర్‌

స‌ర్కారోడు, సీఈవో, సిటిజ‌న్‌. విశ్వంభ‌ర‌….

ఇలా… రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాకి అనుకొన్న టైటిళ్లు చాలా ఉన్నాయి. వీటిలో ఏదో ఒక‌టి సెట్ చేస్తార‌ని ఫ్యాన్స్ భావించారు. కానీ స‌డ‌న్‌గా… శంక‌ర్ కొత్త టైటిల్ ని బ‌య‌ట‌కు తీసుకొచ్చాడు. `గేమ్ ఛేంజ‌ర్‌` అనే పేరు చ‌ర‌ణ్ సినిమాకి ఫిక్స్ చేశాడు. నిజానికి ఈ టైటిల్ గురించి బ‌య‌ట‌కు ఎలాంటి లీకూ రాలేదు. చిత్ర బృందంలో కూడా చాలామందికి ఈ పేరు పెడ‌తార‌న్న ఐడియా కూడా లేద‌ట‌. త‌న మ‌న‌సులో అనుకొన్న పేరు.. ప్ర‌క‌టించి స‌డ‌న్‌గా అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేశాడు శంక‌ర్‌.

నిజానికి ఇదో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. అందుకే టైటిల్ కూడా దాన్ని ధ్వ‌నించేలా ఉంటుందని భావించారంతా. `గేమ్ ఛేంజ‌ర్` మాత్రం ఎవ‌రికీ ఊహ‌కూ రాని టైటిల్‌. పొలిటిక‌ల్ గేమ్ లో… కింగ్‌లూ, కింగ్ మేక‌ర్లూ ఉంటారు. గేమ్ ఛేంజ‌ర్‌.. అనే ప‌దం పాలిటిక్స్‌కి లింక్ చేయ‌డం శంక‌ర్ తెలివి తేట‌ల‌కు, ఆలోచనా విధానానికీ నిద‌ర్శ‌నం. టైటిల్ పాన్ ఇండియా స్థాయిలో మోత మోగాలంటే.. అంద‌రికీ తెలిసే ప‌ద‌మై ఉండాలి. గేమ్ ఛేంజ‌ర్ అంటే తెలియ‌నివాళ్లు లేరు. కాబ‌ట్టి.. శంక‌ర్ ఈ టైటిల్ వైపు మొగ్గు చూపించాడు. అయితే.. ఈ టైటిల్ మాస్‌కి ఎంత ఎక్కుతుంద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. చ‌ర‌ణ్ అభిమానుల్లో మాస్ శాతం చాలా ఎక్కువ‌. ఎందుకంటే.. వాళ్లంతా చిరంజీవిని బేస్ చేసుకొని అయిన ఫ్యాన్స్‌. వాళ్ల‌కు టైటిల్ కాస్త కొరుకుడు ప‌డ‌ని వ్య‌వ‌హార‌మే. కాక‌పోతే.. ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది. ఈలోపుగా.. టైటిల్ ని మెల్ల‌మెల్ల‌గా జ‌నంలోకి తీసుకెళ్లొచ్చు. అందుకే… శంక‌ర్ ఈ టైటిల్ ని ధైర్యంగా ప్ర‌క‌టించేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : బ్యాన్ చేసి ఏబీఎన్‌ క్రేజ్ పెంచేసిన జగన్ !

ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ...

లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయన్న కోర్టు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు అనూహ్యమైన షాక్ తగిలింది. నేరుగా కోర్టే ప్రాథమిక అదారాలు ఉన్నాయని వ్యాక్యానించింది. ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ ఆరోపణలు చేసింది. కానీ న్యాయమూర్తి ఆధారాలున్నాయని...

వారాహియాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన !

ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. పద్నాలుగో తేదీన వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల ముందే అమరావతి చేరుకుని హోమాలు చేయనున్నారు. ఆ...

గుడివాడ టిడ్కో ఇళ్లు -పరువు పోగొట్టుకున్న కొడాలి నాని !

గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్దిదారులకు కేటాయించారు. చివరికి రోడ్లు, కరెంట్ వంటి సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు హ్యాండోవర్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close