సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు – వివేకా కేసు మళ్లీ మొదటికి !?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసి దాఖలు చేసిన పిటిషన్ మేరకు విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణాధికారిని మార్చాలని లేదా మరో అధికారిని నియమించాలని సీబీఐ డైరక్టర్‌ను ఆదేశించింది. కేసు స్టేటస్ రిపోర్టును సీబీఐ అధికారులు సమర్పించారు. ఎక్కడ చూసినా రాజకీయ దురుద్దేశమే అని రాశారని.. అలా అయితే నిందితులకు శిక్ష పడదని చెప్పుకొచ్చారు. హత్యకు కుట్రపై విస్తృతంగా దర్యాప్తు చేయలేదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. పెద్ద స్థాయిలో దాగి ఉన్న కుట్ర గురించి ఏ మాత్రం దర్యాప్తు చేసినట్లుగా లేదని ధర్మాసనం… స్పష్టం చేసింది. వివేకా హత్య వెనుక ఉన్న సూత్రధారులు.. దాని వెనుక ఉన్న కుట్ర గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎలా చూసినా వివేకా హత్య కేసు నిందితులు కోరుకున్నట్లుగా విచారణాధికారి రాంసింగ్ దర్యాప్తు నుంచి వైదొలిగే పరిస్థితి వచ్చినట్లయింది. ఆయన ఈ కేసు విచారణలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. చివరికి ఆయనపై కేసులు కూడా పెట్టారు. చివరికి దర్యాప్తు కీలక దశకు వచ్చిన తర్వాత ఆయనను బదిలీ చేయడం లేదా ఆయన పైన మరో దర్యప్తు అధికారిని నియమించడం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పటి వరకూ నిందితులు కోరుకున్నది జరిగినట్లవుతుంది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే కుట్రలు, ఉద్దేశాలు, సూత్రదారులలపై సీబీఐ దర్యాప్తు మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే కేసు విచారణ మళ్లీ మొదటికి వస్తుంది. విచారణ ఆలస్యమైందని.. ఇంకా ఎంత కాలం సాగదీస్తారని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసినప్పటికీ ఈ కేసు మరింత కాలం సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కీలక నిందితుల అరెస్ట్ వరకూ వచ్చిన ఈ వ్యవహారం చివరికి మళ్లీ మొదటికి రావడం… అనూహ్యమే అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close