అప్పట్లో డాక్టర్ సుధాకర్.. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న !

దళిత వైద్యులైన సుధాకర్, అచ్చెన్నల్లా తాను ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని… అందుకే ఏపీ వదిలి వచ్చేశానని ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి ప్రకటించారు. డాక్టర్ సుధాకర్‌ గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. మరి డాక్టర్ అచ్చెన్న ఎవరు అని అందరూ ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. డాక్టర్ అచ్చెన్న హత్య అంతకు ముందు రోజే జరిగింది. అదీ కూడా కడప జిల్లాల్లో. హైలీ రెస్పెక్టడ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే ప్రధాన సూత్రధారిని పోలీసులు తేల్చారు కానీ ఇందులో బయటకు రాని రాజకీయ కోణాలు చాలా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉండవల్లి శ్రీదేవి ప్రకటించారు.

కడపలోని జిల్లా పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ సి.అచ్చెన్న ను వారం రోజుల కిందట సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు తోటి ఉద్యోగులతో ఏర్పిడన వివాదంలో ఆయనదే తప్పని చెబుతూ ఆయనపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నిజానికి ఆయన అంతకు రెండు రోజుల ముందే కనిపించకుండా పోయారు. ఆయన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఇదేమీ పట్టించకుకోకుండా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. పోనీ పోలీసులు విచారణ జరిపారా అంటే లేదు. రకరకాల కారణాలు చెబుతూ పది రోజుల పట్టించుకోలేదు. హఠాత్తుగా ఆయన మృతదేహం బయటపడింది. ఈ నెల 12న అదృశ్యమైన అచ్చెన్న 24న అన్నమయ్య జిల్లాలో శవమై కనిపించారు.

మొదట ఆత్మహత్య.. అన్నట్లుగా ప్రచారం చేసి.. చివరికి హత్య గా పోలీసులు నమోదు చేశారు. ఇలా మార్పు వెనుక చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ అచ్చెన్నను పశుసంవర్ధక శాఖలో ఎడిలు శ్రీధర్‌ లింగారెడ్డి, సుధీర్‌నాథ్‌ బెనర్జీ, సుభాష్‌ చంద్రబోస్‌ కలిపి హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా మరో దళిత అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యవహారం .. దళిత వర్గాల్లో సంచలనం రేపుతోంది. సైలెంట్‌గా చంపుతున్నారని… బయటకు రాకుండా చేస్తున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close