టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ హీరోల రీ ఎంట్రీ సీజన్

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ లో గతం లో ఫేడ్ అవుట్ అయిన హీరోల రీ ఎంట్రీ సీజన్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతం లో హీరోలు గా కొంత కాలం పాటు విజయ పథంలో పయనించి, ఆ తర్వాత ఫ్లాపుల కారణంగానో ఇతర కారణాల వల్లో ఇండస్ట్రీ కి దూరమైన వారంతా ఇప్పుడు క్యారెక్టర్ పాత్రల తో తెలుగు ప్రేక్షకుల ను అలరించడానికి సమాయత్తమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

వేణు తొట్టెంపూడి గతం లో స్వయంవరం, చిరు నవ్వుతో వంటి చిత్రాల తో ప్రేక్షకుల లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత సరైన హీరో పాత్రలు దొరక్కపోవడం తో సెకండ్ హీరో పాత్రలో కూడా పోషించారు. కానీ ఆయన హీరో గా నటించిన రామాచారి వంటి చిత్రాలు మరీ డిజాస్టర్లు గా మిగిలి పోవడం తో ఇటు ప్రేక్షకుల నుండి అటు దర్శక నిర్మాతల నుండి వేణు కి సరైన మద్దతు లభించక పోవడం తో నెమ్మది నెమ్మదిగా ఆయన తెలుగు తెర పై ఫేడ్ అవుట్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజా గా రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా లో ప్రధాన పాత్ర లో వేణు నటించనున్నారు. ఈ సినిమా తనకు కావలసిన బ్రేక్ ఇస్తుందని వేణు నమ్ముతున్నారు. అయితే ఇదే ఉద్దేశంతో గతం లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో వేణు నటించినప్పటికీ అప్పట్లో ఆ సినిమా ఆయనకు బ్రేక్ ఇవ్వలేకపోయింది.

ఇక ఇదే విధంగా క్యారెక్టర్ పాత్రలకు మొగ్గు చూపుతున్న మరొక హీరో సుమంత్. అక్కినేని కుటుంబం అన్న బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సుమంత్ హీరోగా నిలదొక్కుకోలేక పోయారు. సత్యం, గోదావరి వంటి హిట్ సినిమాలు తన ఖాతా లో ఉన్నప్పటికీ ఆయన దీర్ఘ కాలం హీరోగా నిలబడలేకపోయారు. ఆ మధ్య ఆయన నటించిన మళ్ళీ రావా సినిమా హిట్ అయినప్పటికీ తగిన కథలు ఎంపిక చేసుకో లేకపోవడంతో మళ్లీ ఫ్లాప్ ల బాట పట్టారు ‌. మొన్నామధ్య థ్రిల్లర్ జోనర్ లో కపటధారి లాంటి సినిమాలు ప్రయత్నించినప్పటికీ అది కూడా వర్కవుట్ కాలేదు. అయితే సుమంత్ ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వం లో దుల్కర్ సల్మాన్ హీరో గా చేస్తున్న త్రిభాషా చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పాత్ర కు ప్రాధాన్యత ఉంటే హీరో పాత్ర కాకపోయినప్పటికీ ఒప్పుకోవడానికి సుమంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గా తెలుస్తోంది.

ఇప్పుడు ఇదే జాబితాలో తాజాగా చేరుతున్న మరొక హీరో వడ్డే నవీన్. గతంలో పెళ్లి, మనసిచ్చి చూడు వంటి చిత్రాల తో హీరో గా సక్సెస్ సాధించిన వడ్డే నవీన్ ఆ తర్వాతి కాలంలో ఫ్లాపుల బాట పట్టారు. కొన్ని సార్లు మంచి కథలు ఎంచుకున్నప్పటికీ ఫ్లాపులు చవి చూడక తప్పలేదు. వడ్డే నవీన్ తండ్రి గతంలో ఎన్టీఆర్ తో బొబ్బిలి పులి వంటి సినిమాలు నిర్మించి ఉన్నారు. అయినప్పటికీ ఆ నేపథ్యం వడ్డే నవీన్ ని హీరో గా కొనసాగించడం లో ఉపయోగ పడలేదు. అయితే ఇప్పుడు వడ్డే నవీన్ కూడా హీరో గా కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.

వీరే కాకుండా 1990, 2000 దశకాల లో హీరో లు గా ప్రయత్నించి, సక్సెస్ కాలేక పోయిన నటులు చాలా మంది ఇప్పుడు తమ వయసు కు తగ్గ, కథలో కాస్త ప్రాధాన్యత కలిగిన పాత్రలు వస్తే ఒప్పుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. అంతే కాకుండా వీరిలో కొందరు తాజాగా ఇండియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళ ,కన్నడ పరిశ్రమలలో కూడా ప్రస్తుతం ఇదే సీజన్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి వీరిలో ఎంత మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా నిలదొక్కుకుంటారు అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ : మాస్ట్రో

మంచి క‌థ‌ని ఎంత చెత్త‌గా తీసినా చూడొచ్చు చెత్త క‌థ‌ని ఎంత బాగా చెప్పాల‌నుకున్నా చూడ‌లేం - అన్న‌ది సినిమా వాళ్లు న‌మ్మే మాట. అందుకే మంచి క‌థ‌లు ఎక్క‌డైనా స‌రే చ‌లామ‌ణీ అయిపోతుంటాయి....

ల‌వ్ స్టోరీ కోసం చిరంజీవి

నాగార్జున‌తో చిరంజీవికి ఉన్న అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. నాగార్జున `వైల్డ్ డాగ్` స‌మ‌యంలో చిరు ప్ర‌త్యేక‌మైన అభిమానంతో ఆ సినిమాని ప్ర‌మోట్ చేశాడు. నాగ‌చైత‌న్య‌,...

ఏపీలో ఇళ్ల రుణాల వన్‌టైం సెటిల్మెంట్ పథకం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రజలను ఇళ్ల రుణాల నుంచి విముక్తుల్ని చేయాలని నిర్ణయించారు. హౌసింగ్ లోన్ల భారంతో కట్టలేకపోయిన 46 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ వన్ టైం...

చిన్నారి హత్యాచార నిందితుడి “ఆత్మహత్య” శిక్ష!

రాజకీయ వివాదంగా మారిన సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడు చివరికి "ఆత్మహత్య" శిక్షకు గురయ్యాడు. రాజు అనే ఆ నిందితుడి మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించారు. ఘట్...

HOT NEWS

[X] Close
[X] Close