ప్చ్.. సింధు..! సెమీస్‌లో ఓటమి..!

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించుకు వస్తుందని సింధుపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి తైజూపై పైచేయి సాధించడంలో సింధూ విఫలమయింది. వరుస సెట్లలో పరాజయం పాలైంది. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోందన్న టెన్షన్‌కు గురయిందేమోకానీ.. సింధు మొదటి నుంచి ఒత్తిడిలో ఉన్నట్లుగానే ఆడింది. పెద్దగా పోటీ ఇవ్వలేదు. మొదటి సెట్‌లో కాస్త పోటీ ఇచ్చినట్లుగా కనిపించినా… తర్వాత మాత్రం పూర్తిగా నీరసించిపోయింది. మొదటి సెట్ కోల్పోవడంతో ఇక చేతులెత్తేసినట్లుగా ఆడింది.

సింధు తనదైన స్మాష్‌లను కొట్టలేకపోయింది. మరో వైపు ప్రత్యర్థి తైజూ మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో కనిపించారు. దానికి కారణం … పీవీ సింధుపై ఆమెకు ఉన్న ట్రాక్ రికార్డే కావొచ్చు. ముఖాముఖి ఆడిన మ్యాచ్‌లలో 80 శాతం విజయాలు తైజూ ఖాతాలో ఉన్నాయి. దీంతో తాను గెలవడం ఖాయమన్న అంచనాలో ఆమె ఆత్మ విశ్వాసాన్ని పెంచుకున్నట్లుగా కనిపించింది. మరో వైపు సింధుపై ఒత్తిడి పెరిగింది. కనీసం కాంస్య పతకం దక్కాలంటే… మరో మ్యాచ్‌లో గెలవాల్సి ఉంది. చైనా ప్లేయర్ జియాబావోతో కాంస్యం కోసం మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే… కాంస్య పతకం లభిస్తుంది. అలాఅయినా భారత్‌కు… సింధుకు ఘనతే.

గత ఒలింపిక్స్‌లో రజతం.. ఈసారి కాంస్యం సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు దక్కుతుంది. అయితే భారత స్వర్ణం ఆశలను ఇతర ఆటగాళ్లు ముందుకు తీసుకెళ్తున్నారు. బాక్సన్ లవ్లీనాపై ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. తొలి రోజే భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను పతకం అందించారు. ఆ తర్వాత మరో ఆటగాడు పతకం తేలేకపోయారు. పతకాల పట్టికలో భారత్ ఒక్క పతకంతోనే కొనసాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

“జియో మార్ట్‌” ద్వారా టిక్కెట్లమ్మారని చెబితే దుష్ప్రచారమా !?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తాము చేసిన పనులను మీడియా చెప్పినా దుష్ప్రచారం .. కేసులు పెడుతామంటూ హెచ్చరికలు చేయడం ప్రారంభించారు. శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను జియో మార్ట్...

టీడీపీ – జనసేన కలిస్తే వచ్చే ఫలితాలపై మళ్లీ చర్చ !

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. చివరికి మండలాధ్య పదవుల ఎన్నికలు కూడా ముగిశాయి. అంతా అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కంటే ఎక్కువగా జరుగుతున్న చర్చ టీడీపీ -...

“కడియం”ను టీడీపీకి ఇచ్చేసిన జనసేన !

రెండు రోజుల కిందట కడియం నుంచి వచ్చిన ఎంపీటీసీలతో పవన్ కల్యాణ్ సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర హెచ్చరిక చేశారు. తమ పార్టీ ఎంపీటీసీలను లాక్కుంటే ఊరుకునేది లేదని స్వయంగా...

HOT NEWS

[X] Close
[X] Close