ఇళ్లు కొనాలని ప్లాన్ చేసుకున్న వారికి ఒక డౌట్ ఉంటుంది. కాస్త తక్కువ ధరకు వస్తుందని .. ఇప్పుడే నిర్మాణం ప్రారంభించిన ఇంటిని కొనడమా.. లేకపోతే పూర్తి అయిన ఇంటిని కొనడమా అనేది ఆ డౌట్. మన రియల్ ఎస్టేట్ మార్కెట్ లో నమ్మకం అనేది ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. మోసగాళ్లు ఎక్కువగా ఉన్నారు . మోసపోతే గోసలు తీర్చే వ్యవస్థలు కూడా గొప్పగా లేవు. అందుకే రెడీ టు మూవ్ ఇళ్లు అత్యుత్తమం అనే భావన ఎక్కువ మందిలో ఉంది.
రెడీ టు మూవ్ (RTM) ఇళ్లు కొనుగోలు చేయడం ఇంటి కొనుగోలుదారులకు అత్యంత లాభదాయకమైన ఎంపికగా రిల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులతో పోలిస్తే, RTM ఇళ్లు తక్షణ ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వం , తక్కువ రిస్క్‌లతో ఉంటాయి. రియల్ ఎస్టేట్ నిపుణులు అండర్ కన్స్ట్రక్షన్ ఇళ్లు కొనుగోలు చేస్తే, ప్రాజెక్టు పూర్తి కావడానికి సంవత్సరాలు పట్టవచ్చు. డెవలపర్లు ఇచ్చిన డెడ్లైన్లు తరచుగా ఆలస్యమవుతాయి, దీంతో కొనుగోలుదారులు అదనపు అద్దె ఖర్చులు భరించాల్సి వస్తుంది. మరోవైపు, RTM ఇళ్లు కొనుగోలు చేస్తే తక్షణమే ఇంట్లోకి వెళ్లవచ్చు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో, సమయం డబ్బు. RTM ఇళ్లు ఆ సమయాన్ని ఆదా చేస్తాయి ఇటీవలి సర్వేల ప్రకారం, 70% మంది కొనుగోలుదారులు ఆలస్యాల కారణంగా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు వద్దనుకుంటున్నారు. RTM ఇళ్ల ప్రత్యేకత ఏమిటంటే, కొనుగోలుదారులు పూర్తిగా నిర్మాణమైన ఇంటిని పరిశీలించి, నాణ్యతను తనిఖీ చేయవచ్చు. అండర్ కన్స్ట్రక్షన్ ఇళ్లలో మాత్రం బ్రోచర్లు లేదా మోడల్ ఫ్లాట్లపై ఆధారపడాలి, దీంతో నాణ్యతా సమస్యలు తర్వాత తలెత్తవచ్చు. రెడీ టు మూవ్ ఇళ్లలో వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ వైరింగ్, ఫినిషింగ్ వంటి అంశాలను స్వయంగా చెక్ చేసుకోవచ్చు. ఇది భవిష్యత్ రిపేర్ ఖర్చులను తగ్గిస్తుంది. RERA నివేదికల ప్రకారం, అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల్లో 40 శాతం ఫిర్యాదులు నాణ్యతా సమస్యలపైనే స్తున్నాయి.
RTM ఇళ్లపై GST వర్తించదు, అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఇళ్లపై 5% GST చెల్లించాలి. RTM ఇళ్లు కొనుగోలు చేస్తే, అద్దె ఖర్చులు ఆదా అవుతాయి , ఆర్థిక భారం తగ్గుతుంది. ఇంటి కొనుగోలు ప్లాన్ చేస్తున్న వారు తమ అవసరాలు, బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి.