దేశంలో రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఈ ఏడాది భిన్నంగా సాగింది. అమ్మకాల పరిమాణం పరంగా తగ్గుదల కనిపించినప్పటికీ, అమ్మకాల విలువ పరంగా మాత్రం మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టించింది.
2025లో దేశంలోని ప్రధాన 7 ఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 9 నుండి 12 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా జనవరి – సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ తగ్గుదల స్పష్టంగా కనిపించింది. ఆశ్చర్యకరంగా అమ్మకాల విలువ మాత్రం 14 శాతం పైగా పెరిగి రూ. 1.52 లక్షల కోట్లకు చేరింది. అంటే, తక్కువ ఇళ్లు అమ్ముడైనప్పటికీ, అమ్ముడైన ప్రతి ఇల్లు ఖరీదైనది కావడం వల్ల మార్కెట్ ఆదాయం పెరిగింది.
ఈ ఏడాది రియల్ ఎస్టేట్ను నడిపించింది మధ్యతరగతి ఇళ్లు కాదు, లగ్జరీ మరియు ప్రీమియం గృహాలు. 1.5 కోట్ల నుండి 4 కోట్ల రూపాయల పైబడిన ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సంపన్న వర్గాలు, ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ సెగ్మెంట్ 28 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు, నిర్మాణ ఖర్చులు పెరగడం వలల్ సామాన్యులకు అందుబాటులో ఉండే అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ మాత్రం ఒడిదుడుకులకు లోనైంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2025లో ఒక విలక్షణమైన ధోరణిని ప్రదర్శించింది. కొన్ని నివేదికల ప్రకారం కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లు, విక్రయాలు ప్రారంభంలో 25శాతం తగ్గినట్లు కనిపించినా, ఏడాది చివరకి వచ్చేసరికి మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ గచ్చిబౌలి, కోకాపేట్ లో ధరలు చదరపు అడుగుకు రూ. 9,100 నుండి రూ.13,000 వరకు పెరిగాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 6 నుండి 16 శాతం వరకు పెరిగాయి మొత్తంగా 2025 రియల్ ఎస్టేట్ మార్కెట్ “పరిమాణం కంటే నాణ్యత” ( కి ప్రాధాన్యతనిచ్చింది. సరసమైన ధరల ఇళ్లలో మందగమనం ఉన్నప్పటికీ, ప్రీమియం ,ఆఫీస్ స్పేస్ లీజింగ్ రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇచ్చాయి. 2026 నాటికి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటంతో, రాబోయే ఏడాదిలో మళ్ళీ మధ్యతరగతి ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
