అమరావతి ఇప్పుడు శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. పన్నెండు వేల మంది కార్మికులు ఇప్పుడు అక్కడ 24/7 పనులు చేస్తున్నారు. దీంతో వచ్చే మూడు, నాలుగేళ్లలో ఎవరూ ఊహించని విధంగా అమరావతి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ సమీపంలో ఇళ్ల కొనుగోలు చేయాలనుకునేవారు పెరుగుతున్నారు. డిమాండ్ పెరుగుతోంది. మంగళగిరి సమీపంలో ఉన్న కాజ గ్రామంపై ఎక్కువ మంది దృష్టి ఉంది.
కాజా గ్రామం గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో ఉంది, గుంటూరు నగరం నుండి సుమారు 18 కి.మీ. దూరంలో ఉంది. అమరావతి క్యాపిటల్ రీజియన్ (APCRDA) లో భాగం. కానీ ల్యాండ్ పూలింగ్ ఇక్కడి వరకూ రాలేదు. నాగార్జున యూనివర్సిటీకి సమీపంలో ఉండటంతో రెసిడెన్షల్ ,కమర్షియల్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది చిన్న బిల్జర్లు, మేస్త్రీలు ఇళ్లు కట్టించి అమ్ముతున్నారు.
రెడీ-టు-మూవ్ , అండర్-కన్స్ట్రక్షన్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో 5-10 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అపార్టుమెంట్లలో చదరపు అడుగు మూడున్నర వేల నుంచి నాలుగు వేల వరకూ చెబుతున్నారు. సౌకర్యాలను బట్టి కాస్త తక్కువ, ఎక్కువ ఉంటున్నాయి. ఓపెన్ ప్లాట్లలో స్థలాలు పాతిక వేల నుంచి లభిస్తున్నాయి. 2 BHK అపార్ట్మెంట్లు 35 నుంచి 50 లక్షల వరకూ లభిస్తున్నాయి. హై-రైజ్ అమెనిటీలతో 70 లక్షల వరకూ ధర పలుకుతోంది.
భవిష్యత్ లో ఈ ప్రాంతం అమరాతిలో కలిసిపోయి.. మంచి కమర్షియల్ సెంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండటంతో .. ఇక్కడ ఇల్లు లేదా స్థలం ఉన్న వారు నిశ్చింతమైన పెట్టుబడి పెట్టినట్లుగానే అంచనా వేస్తున్నారు.