రియల్ ఎస్టేట్, బంగారం ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది భారతీయ సంప్రదాయ పెట్టుబడిదారులకు పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఎక్కువ ఎక్కడ రిటర్న్స్ వస్తాయో అక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఇటీవల బంగారం విపరీతంగా పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ మందకొడిగా ఉంది. అయితే ఎల్లకాలం ఉండదు. ఎదైనా పెద్దగా బూమ్ లేనప్పుడు పెట్టుబడి పెడితే.. బూమ్ వచ్చినప్పుడు లాభాల పంట పండుతుందని అనుకుంటారు. అందుకే ఆలోచిస్తున్నారు.
వెల్త్ కన్వర్సేషన్స్’ రిపోర్ట్ ప్రకారం, గత 20 సంవత్సరాల కిందట రూ.1 లక్ష ఇన్వెస్ట్మెంట్ బంగారంలో పెడితే రూ.15.5 లక్షలు అయింది. అంటే15శాతం CAGR వచ్చినట్లు. రియల్ ఎస్టేట్లో రూ.4.4 లక్షలు అంటే 7.7శాతం CAGR. మాత్రమే వచ్చింది . రియల్ ఎస్టేట్లో రెంటల్ ఆదాయం 7-9 శాతం కలిపితే 12-15 శాతంకి చేరుతాయి. ఈ డేటా ఆధారంగా, దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ స్థిరత్వం, డ్యూయల్ ROI తో మెరుగ్గా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత 10-15 సంవత్సరాల డేటా చూస్తే బంగారం షార్ట్-టర్మ్ ర్యాలీలలో ముందంజలో ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ బెటర్ ఆప్షన్. బంగారం ఇన్వెస్ట్మెంట్ సులభం. సావరెయిన్ గోల్డ్ బాండ్స్ , ETFలు, డిజిటల్ గోల్డ్ ద్వారా తక్షణం కొనుగోలు/విక్రయం సాధ్యం. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ఆస్తులు అమ్మడానికి కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది.