మెట్రోల్లో ఇల్లు కొనడం కన్నా దండగ ఇన్వెస్ట్ మెంట్ ఇంకోటి ఉండదని ఆర్థిక నిపుణులు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున విశ్లేషణలు చేస్తున్నారు. వారు చెబుతున్న మాటలు కూడా తీసిపడేసేవి కావు. ఇప్పటికే మెట్రోల్లో వచ్చే పదేళ్ల తర్వాత ఉండాల్సినంత రేట్లకు ఇళ్లు, స్థలాలు అమ్ముతున్నారు. అందుకే ఎంత పెట్టుబడి పెట్టినా డబ్బులు తిరిగి రావని .. సరైన రిటర్న్స్ ఉండవని అంటున్నారు. దానికి బదులుగా మెట్రో సిటీలకు దగ్గరగా ఉండే నగరాల్లో ఆస్తులు కొనడం వల్ల.. మంచి రిటర్నులు ఉంటాయని అంటున్నారు. ఈ ప్రకారం చూస్తే.. హైదరాబాద్ కన్నా వరంగల్ అయితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంటకు మంచిదని అనుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ను రెండవ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. హైవేల విస్తరణ, ఐటీ హబ్‌ల ఏర్పాటు, విమానాశ్రయం నిర్మాణం వంటి వాటితో ఆ ప్రయత్నాలు ముందుకు పడుతున్నాయి. ఇప్పుడు వరంగల్ రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. గత రెండేళ్లలో రూ. 2,500 కోట్లకు పైగా పెట్టుబడులు వరంగల్‌లో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌తో పోలిస్తే తక్కువ ధరలు, విశాలమైన భూమి లభ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న ఐటీ , పారిశ్రామిక కార్యకలాపాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ ఓవర్ ఫ్లో వరంగల్ కు మేలు చేయనుంది.
రంగల్లో ఐటీ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. ఈ హబ్ 2026 నాటికి పూర్తవుతుందని, 10,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని అంచనా.
వరంగల్‌లోని హన్మకొండ, కాజీపేట, భద్రకాళి ఆలయం సమీప ప్రాంతాలు, ఎన్‌హెచ్-163 సమీపంలోని ప్లాట్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక చదరపు గజం ధర ప్రస్తుతం రూ. 5,000 నుంచి రూ. 15,000 వరకు ఉంది. వరంగల్‌లో 2024లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు 18 శాతం పెరిగాయి. రెసిడెన్షియల్ ప్లాట్ల డిమాండ్ 22 శాతం పెరిగింది. వరంగల్‌లో రెసిడెన్షియల్ ప్లాట్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత రెండేళ్లలో 15,000 ప్లాట్లు, 3,000 అపార్ట్మెంట్ యూనిట్లు లాంచ్ అయ్యాయి. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లోనూ వరంగల్ ఆకర్షణగా నిలుస్తోంది.
రియల్ ఎస్టేట్ నిపుణులు వరంగల్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయమని సూచిస్తున్నారు. “వరంగల్‌లో రియల్ ఎస్టేట్ రాబడి రేటు (ROI) 15-20% సంవత్సరానికి ఉంటుంది, ఇది హైదరాబాద్‌లో 10-12%తో పోలిస్తే ఎక్కువ,” అని నిపుణులు చెబుతున్నారు.
