బాల‌య్య‌, మోహ‌న్‌బాబు.. రాలేదెందుకో..?

ఈ వీకెండ్ హంగామా అంతా చిరు ఇంట్లోనే. 80 ద‌శ‌కంలోని తార‌లంతా హాజ‌రై.. ఓ బ్ర‌హ్మాండ‌మైన పార్టీ చేసుకున్నారు. క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ఓ క్ల‌బ్ ఏర్పాటై.. ప్ర‌తీ యేటా రెండు రోజులు స‌ర‌దాగా గ‌డుపడం ఆనవాయితీ. ఈసారి ఈ వేడుక చిరంజీవి ఇంట్లో జ‌రిగింది. నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి అగ్ర‌తార‌లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ గ్యాంగ్‌లో బాల‌కృష్ణ, మోహ‌న్‌బాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌లాంటి స‌మ‌కాలీకులు మిస్స‌య్యారు. ప్ర‌తీయేటా బాల‌య్య, మోహ‌న్ బాబుల హాజరు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. చిరు ఇంట్లో పార్టీ అంటే వాళ్లూ వ‌స్తార‌నుకున్నారంతా. చిరుకీ బాల‌య్య‌కూ మంచి అనుబంధం ఉంది. ఇక చిరు – మోహ‌న్‌బాబుల గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. ఈసారి మాత్రం ఇద్ద‌రూ మిస్స‌య్యారు. త‌మిళ‌నాట నుంచి ర‌జ‌నీకాంత్‌,క‌మ‌ల్‌హాస‌న్ రాలేక‌పోయారు. మ‌మ్ముట్టి కూడా మిస్సింగే. వీళ్లంతా వ‌చ్చి ఉంటే.. ఈ కార్య‌క్ర‌మం మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com