విశ్లేష‌ణ‌: తెలుగు గురించి సినీతార‌ల‌కు ప‌ట్ట‌దా?

తెలుగు భాష‌కు సంబంధించి ఏపీలో ఓ ఉద్య‌మ‌మే న‌డుస్తోంది,. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఇంగ్లీషు మీడియం ప్ర‌వేశ పెట్టే విష‌యంలో ఏపీలో నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. మేధావులు మాట్లాడుతున్నారు. రాజ‌కీయ‌నాయ‌కులు గొంతు విప్పుతున్నారు. విద్యార్థులు ప్ర‌శ్నిస్తున్నారు. భాష‌కు సంబంధించి ఓ ఆల‌జ‌డే రేగుతోంది. కానీ… ఈ విష‌య‌మై తెలుగు సినిమా వాళ్లెవ్వ‌రూ అస్స‌లు గొంతే విప్ప‌డం లేదు. అస‌లు ఈ విష‌యం త‌మ‌కు ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగుపై మ‌మ‌కారం మ‌న తెలుగు సినిమా వాళ్ల‌కు లేదా..? రాదా..? లేదంటే… ఇది రాజ‌కీయ ప‌ర‌మైన స‌మ‌స్య‌గా వ‌దిలేస్తున్నారా..?

తెలుగు భాష గొప్ప‌ద‌నం గురించి చాలా సినిమాల్లో చెప్పారు. చెబుతున్నారు. మ‌న సంప్ర‌దాయాల్నీ, సంస్క్రృతుల్నీ కాపాడుకోవాల‌ని డైలాగులు వ‌ల్లిస్తున్నారు. ఇవ‌న్నీ థియేట‌ర్లో చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవ‌డం వ‌ర‌కేనా? అనిపిస్తుంది. ఇప్పుడు ఏపీలోనే కాదు, తెలుగు రాష్ట్రాల‌లోనే భాష‌కు సంబంధించిన ఓ ఉద్య‌మం న‌డుస్తోంది. తెలుగుని బ‌తికించుకోవాల్సిందే అంటూ.. చాలామంది గ‌ళం ఎత్తుతున్నారు. వాళ్ల‌లో సినిమా వాళ్లే లేరు. భాష‌పై సినిమావాళ్ల ప్రేమ కేవ‌లం మాట‌ల‌కు, థియేట‌ర్ల వ‌ర‌కే ప‌రిమితం అనిపిస్తుంది. త్రివిక్ర‌మ్ నుంచి కొర‌టాల శివ వ‌ర‌కూ అంద‌రూ తెలుగుని గౌర‌విస్తున్నాం అని మాట్లాడేవాళ్లే. కానీ ఇప్పుడు వాళ్లెక్క‌డ‌..? క‌నీసం క‌నిపించ‌డం లేదే..? ఒక్క వ్యాఖ్య కూడా చేయ‌లేదే…?

నిజానికి తెలుగుని లోకువ చేస్తోందే సినిమా వాళ్లు. మ‌న తెలుగు సినిమాల‌కు ప‌రాయి టైటిళ్లు పెట్టుకోవ‌డం అంటే మోజు. చాలా వ‌ర‌కూ టైటిళ్లు ఇంగ్లీషులోనే క‌నిపిస్తున్నాయి. అదో ప్యాష‌న్ అయిపోయింది. టైటిల్ తెలుగులో ఉన్నా, క్యాప్ష‌న్ ఇంగ్లీషులో ఉండాల్సిందే. అది రూలైపోయింది. తెలుగు సినిమాల్లో తెలుగు న‌టీన‌టులు క‌నిపించ‌రు. ప‌రాయి రాష్ట్రం నుంచి బోలెడ‌న్ని డ‌బ్బులు పోసి ఆర్టిస్టుల్ని దిగుమ‌తి చేసుకుంటారు. వాళ్ల వ‌చ్చీ రానీ గొంతుతోనే డైలాగులు చెప్పించుకుంటారు. అదే ట్రెండ్ అయిపోతుంది. పాట‌ల్లోనూ ఇంగ్లీషు ప‌దాల మోతే. తెలుగులో ఎంతోమంది గాయ‌కులున్నారు. వాళ్ల‌ని ప్రోత్స‌హిస్తున్న‌దెంత‌మంది. అద్నాన్ స‌మీ, బాబా సైగ‌ల్‌, సిద్ద్ శ్రీ‌రామ్‌… వీళ్ల వ‌చ్చీ రాని తెలుగు పాటల‌నే హిట్ చేసేసుకుంటున్నాం. ఇదీ మ‌న తెలుగు దౌర్భాగ్యం.

ఇంత‌టి ప్రేమ ఉన్న తెలుగు సినిమావాళ్ల‌కు తెలుగు ఉద్య‌మంలో ఓ చేయి వేయాల‌ని ఎందుకు అనిపిస్తుంది..? ప్ర‌శ్నించాల‌న్న ఆలోచ‌న ఎక్క‌డి నుంచి పుడుతుంది..? కాక‌పోతే.. మైకు ప‌ట్టుకున్న‌ప్పుడో, ఆడియో వేడుక‌ల్లోనో, సినిమాల్లో డైలాగులు చెబుతున్న‌ప్పుడో… అమ్మ భాష – అమృత భాష అంటూ రొడ్డ‌కొట్టుడు ఉప‌న్యాసాలు ఇవ్వ‌మాకండి. ఎందుకంటే… అలాంటి డైలాగుల్ని కూడా జోకులు అనుకుని న‌వ్వుకోవాల్సివ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close