అంబటి రాంబాబుపై వివాదాలన్నీ రేసు నుంచి తప్పించడానికేనా..!?

అంబటి రాంబాబు వైసీపీలో అత్యంత వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరుగా మారుతున్నారు. ఆయన వరుసగా వివాదాల్లోకి ఎక్కుతున్నారు. ఆయనపై వస్తున్న ఆరోపణలన్నీ సొంతపార్టీ నేతలు చేస్తూండటమే ఇందులో ట్విస్ట్. మరో ఏడాదిలో జరగనున్న మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణలో కేబినెట్ బెర్త్ కోసం పెద్ద ఎత్తున రేస్ నడుస్తోంది. సామాజిక సమీకరణలతో పాటు విధేయత పరంగా కూడా అంబటి రాంబాబుకు ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అయితే గుంటూరులో రెడ్డి సామాజికవర్గం నేతలు బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారే తన ఇమేజ్ డ్యామేజ్ చేసి బెర్త్ దక్కకుండా చేసేందుకే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని అంబటి రాంబాబు అనుమానిస్తున్నారు.

అంబటి రాంబాబుపై ఇటీవల అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంబటి మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సొంత పార్టీ కార్యకర్తలే హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యవహారం విచారణ దశలో ఉండగానే మరో రెండు వివాదాలు అంబటిని చుట్టుకున్నాయి. అంబటికి అత్యంత న్నిహితులైన ఇద్దరు నేతలు రెండు భూములను కబ్జా చేశారు. వాటి వివరాలు వైసీపీ నేతల నుంచే మీడియాకు అందాయి. బెదిరింపుల ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారాలపై విచారణకు కూడా ఆదేశించారు. అధికారులు భూములను పరిశీలించారు. అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో అంబటి ఇరుక్కుపోయినట్లయింది.

రెపల్లేకు చెందిన అంబటి రాంబాబుకు సత్తెనపల్లితో ఎలాంటి సంబంధం లేదు. సామాజికవర్గం బలంతో సత్తెనపల్లిలో అంబటి పాగా వేశారు. అయితే సత్తెనపల్లి స్థానిక వైసీపీ నేతలకు రాంబాబుపై అంత సానుకూలత లేదు. ఇప్పుడు తమ ప్రాంతం నుంచి మంత్రి పదవికే పోటీ వస్తున్నారని తెలిసి.. ఇతర నేతలూ రగిలిపోతున్నారు. అందుకే సత్తెనపల్లిని అంబటి రాంబాబు ఆదాయవనరుగా మార్చుకున్నాని… పార్టీ కోసం తాము ఏళ్ల తరబడి కృషి చేసినా.. ఇప్పుడు తమకు ఎలాంటి ప్రయోజనం కల్పించకుండా మొత్తం అంబటినే సొంతం చేసుకుంటున్నారన్న ఆగ్రహం పార్టీ నేల్లో కనిపిస్తోంది. అది హైకోర్టులో పిటిషన్లు.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే వరకూ వెళ్లింది. ఇవే కాదు.. అంబటి గురించి ఇంకా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ నేతల అంతర్గత రాజకీయాల్లో అంబటి ఇరుక్కుపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆరు రోజుల తర్వాత ఏరియల్ సర్వే..! తీవ్రత కనిపిస్తుందా..?

వరద వచ్చి ఆరు రోజులు అయింది. ఇప్పుడు బురద మాత్రమే మిగిలింది. వరద వచ్చినప్పుడు సైలెంట్ గా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ..ఆరు రోజుల తర్వాత ఏరియల్ సర్వే...

ఒత్తిడికి త‌లొంచిన విజ‌య్‌సేతుప‌తి

`800` సినిమా మొద‌లవ్వ‌క ముందే... అనేక వివాదాల్లో, విమ‌ర్శ‌ల్లో చిక్కుకుంది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత క్రికెట్ ఆట‌గాడు ముత్త‌య్య ముర‌ళీధ‌రన్ బ‌యోపిక్ ఇది. ఆ పాత్ర‌లో విజ‌య్‌సేతుప‌తి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఫ‌స్ట్...

దుబ్బాకలో ప్రచారానికి పవన్ కల్యాణ్..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ కన్నా.. బీజేపీ గురించే ఎక్కువ ట్వీట్లు.. ప్రకటనలు చేస్తున్న ఆయనను గరిష్టంగా ఉపయోగించుకోవాలని బీజేపీ...

నిరసనల సెగ…! హైదరాబాద్ వరద బాధితులకు రూ. 550 కోట్లు ఇస్తున్న కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరదలకు నష్టపోయిన హైదరాబాద్ వాసుల్ని ఆదుకోవడానికి కార్యాచణ ప్రణాళిక ప్రకటించారు. హైదరాబాద్‌లో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10 వేల సాయం అందించాలని నిర్ణయించారు. మంగళవారం ఉదయం...

HOT NEWS

[X] Close
[X] Close