ఇప్పుడు జేపీ నడ్డా, అమిత్ షానూ కొడతారా ? : రఘురామ

ఏపీకి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డాలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని.. అవన్నీ గతంలో తాను మీడియాతో మాట్లాడుతూ చేసినవేనని.. ఇప్పుడు తనను కొట్టించినట్లే.. అమిత్ షా, నడ్డాలను కూడా కొట్టిస్తారా అని సీఎం జగన్‌కు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నలు సంధించారు. ఏపీ ప్రభుత్వం అవినీతిమయమని అమిత్ షా చెప్పారని .. ఏపీలో ల్యాండ్, ఇసుక, మైనింగ్, ఎడ్యుకేషన్ అన్నిట్లో అవినీతి జరుగుతోందని నడ్డా విమర్శించారన్నారు. నడ్డా, అమిత్ షా చెప్పిన మాటలే నేను గతంలో చెప్పానని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నానని నన్ను అరెస్ట్ చేసి నా పై రాజద్రోహం కేసు పెట్టారన్నారు.

రఘురామకృష్ణరాజుపై కేవలం మీడియాతో మాట్లాడినందుకే ప్రభుత్వంపై కుట్ర పన్నారని ఏపీసీఐడీ అధికారులు సుమోటోగా రాజద్రోహం కేసు పెట్టి ఆయన పుట్టిన రోజు నాడు ఇంట్లో ఉండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి గుంటూరు సీఐడీ ఆఫీసులో భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంలో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి లో నిర్వహించిన పరీక్షల్లో స్పష్టమయింది. తనపై దాడి చేసిన వారిని శిక్షించాల్సిందేనని ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి పోరాడుతున్నారు. రెండేళ్లు దాటిపోవడంతో ఏపీలో తనను హింసించిన సాక్ష్యాలు ధ్వంసం చేస్తారన్న కారణంతో వాటిని భద్రపరచాలని న్యాయపోరాటం చేస్తున్నారు.

కాల్ రికార్డులు.. అలాగే తనకు చేసిన టెస్టుల రిపోర్టులు భద్రం చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కేసు సీబీఐకి ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో తాను అన్న మాటల్నే.. అమిత్ షా, నడ్డాలు అన్నారని.. వాళ్లనూ కొడతారా అనే ప్రశ్నలు సంధించడం వైసీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది. నిజానికి పార్టీని ధిక్కరించిన వారిని వైసీపీ ఎప్పటికప్పుడు సస్పెండ్ చేస్తోంది కానీ..రఘురామ జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close