ఆన్‌లైన్‌ రియల్ఎస్టేట్ వ్యాపారంలో రికార్డ్: రు.6 కోట్ల ఫ్లాట్ అమ్మిన ‘స్నాప్‌డీల్’

హైదరాబాద్: రోజురోజుకూ విజృంభిస్తున్న ఆన్ లైన్ మార్కెట్ సత్తా ఏమిటో మరోసారి వెల్లడైంది. ఆన్ లైన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఓ రికార్డ్ నమోదయింది. ‘మంత్రి డెవలపర్స్’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరులో ఓ లగ్జరీ పెంట్ హౌస్ ఫ్లాట్ ను ‘స్నాప్‌డీల్’ ఆన్‌లైన్ వెబ్ సైట్ ద్వారా అమ్మింది. మన దేశంలో ఆన్ లైన్ రియాల్టీ డీల్స్ లో ఇదే అతి ఖరీదయిందని భావిస్తున్నారు.

‘మంత్రి ఎస్పానా’ అనే ఖరీదైన అపార్ట్ మెంట్ సముదాయంలోని పెంట్ హౌస్ ను పూర్ణిమ అనే మహిళ రు.6 కోట్లకు కొనుగోలు చేశారు. ఇ కామర్స్ లో ఎంతో పేరున్న స్నాప్ డీల్, గత ఏడాది ఆగస్టు నుంచి ఇళ్లను కూడా తన సైట్లో అమ్మకానికి పెట్టింది. టాటా వేల్యూ హోమ్స్, టాటా హౌసింగ్, డి.ఎల్.ఎఫ్., శోభా డెవలపర్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మంత్రి డెవలపర్స్ వంటి కంపెనీలు ఈ సైట్ ద్వారా ఇళ్లను అమ్ముతున్నాయి. స్పందన చాలా బాగుంది.

టాటా హౌసింగ్ కంపెనీ గత నెలలో ముంబైలో ఓ ఖరీదైన సేల్ జరిపింది. ఓ ఫ్లాట్ ను కోటీ 10 లక్షలకు స్నాప్ డీల్ ద్వారా అమ్మింది. అదే అతిపెద్ద ఆన్ లైన్ డీల్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు బెంగళూరు పెంట్ హౌస్ విక్రయం ద్వారా ఈ క్రెడిట్ ను స్నాప్ డీల్ సొంతం చేసుకుంది.

ఇండియాలో ఈ కామర్స్ భారీగా పెరుగుతుందని వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేసినప్పుడు చాలా మంది పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి డీల్స్ గురించి విన్నప్పుడు అది నిజమే అనిపిస్తుంది. నగరాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులే కాదు, మనిషికి కావాల్సిన సమస్త వస్తువులూ ఆన్ లైన్లో దొరుకుతున్నాయి. చాలా వాటికి డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి కొత్త కొత్త ఈ కామర్స్ వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. దటీజ్ ఇండియా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెట్రిమార‌న్‌తో సినిమా చేయాల‌ని ఉంది: ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌డానికి పెద్ద పెద్ద క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మ‌న‌సులో మాత్రం.. ఓ దర్శ‌కుడు ప్ర‌త్యేక స్థానాన్ని ఆక్ర‌మించుకొన్నాడు. త‌న‌తో సినిమా చేయాల‌ని ఎన్టీఆర్ ఆస‌క్తి చూపిస్తున్నాడు....

సీఎంఆర్ఎఫ్‌కే మేకపాటి విరాళం – జగన్ ఊరుకుంటారా ?

సీఆర్ఆర్ఎఫ్‌కు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని వైసీపీ నేతలు .. తమ వారు అందరికీ సమాచారం పంపారు. అందుకే కొంత మంది చెక్కులు తెచ్చి జగన్ కే ఇచ్చారు. అయితే జగన్ మాటను లెక్క...

నెక్ట్స్ వివేకా కేసులో గీత దాటిన వైపీఎస్‌లే !

ఐపీఎస్‌లు అనే పదానికి అర్థం మార్చేసి వైపీఎస్‌ల తరహాలో చెలరేగిపోయిన అధికారులకు ఇప్పుడు తాము ఎంత తప్పు చేశామో తెలిసే సమయం వచ్చింది. ప్రభుత్వం మారగానే వారు చేసిన తప్పులన్నీ మీద పడిపోతున్నాయి....

కాంగ్రెస్ లో కొత్త షార్ట్ కట్… వర్కింగ్ టు కింగ్.. !

తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల గోల ఎప్పుడూ ఉండేదే.. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఒకప్పుడు ఇస్తే పీసీసీ ఇవ్వండి..అంతేకాని ప్రాధాన్యత లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అక్కర్లేదు అంటూ పెదవి విరిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close