చైతన్య: అమరావతి రైతులపై ప్రాంత ముద్ర ! పాలకులు ఇంత దిగజారిపోతారా ?

రాజధాని అమరావతే ఉండాలని ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేసి అక్కడి ప్రజల్ని రెచ్చగొడతారా..? రాయలసీమకు వెళ్లి మీ ప్రాంతం అభివృద్ది చెందవద్దని వాదిస్తారా..? అంటూ అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో ఏపీ అధికార పార్టీ నేతలు చేస్తున్న వితండ వాదన ఇప్పుడు కాస్త ఆలోచనా పరుల్ని కూడా నివ్వెర పరుస్తోంది. ఆ రైతులు తమకు జరిగిన అన్యాయంపైనే ప్రజాస్వామ్య పద్దతిలో పోరాడుతున్నారు. వారిపై పాలకుులు ఇన్ని కుట్రలు ఎందుకు చేస్తున్నారు..? ఏం ఆశించి చేస్తున్నారు ?

రైతుల పాదయాత్ర ఇతర ప్రాంతాలకు ఎలా వ్యతిరేకం ?

రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వారిపై ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే విషం చిమ్మడం ప్రారంభించింది. వారి పాదయాత్ర ఇంకా రాజధాని గ్రామాలు కూడా దాటక ముందే వారు ఇతర ప్రాంతాలకు వ్యతిరేకం అనే ప్రచారం చేయడం ప్రారంభించారు. తాము చేస్తున్న దానికి ఏ మాత్రం సిగ్గుపడటం కానీ… ఆలోచన చేయడం కానీ.. తప్పు చేస్తున్నామన్న భావనకు కూడా వారు రావడం లేదు. ప్రభుత్వాన్ని చిటికెన వేలుతో నడిపిస్తున్నట్లుగా ప్రచారం చేసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాదయాత్రను ప్రమాదకర ఆట అని చెప్పుకున్నారు. అంత ప్రమాదకరం ఎందుకు అయిందో ఆయన మాటల్లోనే తెలిసిపోయింది. ఇతర ప్రాంతాలకు ఆ రైతులు వ్యతిరేకం అని ఆయన సందేశం పంపుతున్నారు.

ఏపీలో పాలక పార్టీనే ప్రాంతాల చిచ్చు పెట్టే దారుణమైన పరిస్థితి !

సజ్జల రామకృష్ణారెడ్డి మాటలకు తగ్గట్లే ఇతర పార్టీల నేతలు స్క్రిప్టులు పట్టుకుని వైసీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్లు పెట్టి అదే పద్దతిలో రైతుల పాదయాత్రపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అవుతుందని అమరావతి కోసం వారు భూములిచ్చారు. వారెవరూ మోతుబరులు కాదు. రాష్ట్రం కోసం భూములిచ్చి వారు రోడ్డున పడ్డారు. అలాంటి వారిని పట్టుకుని వారు ఇతర ప్రంతాలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నారని ప్రజలకు రెచ్చగొట్టే దౌర్భాగ్యమైన రాజకీయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారభించేసింది. నిజానికి ఆ పార్టీ అధికార పార్టీ. ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా.. కుల, మత, ప్రాంత అనే భావన లేకుండా పరిపాలించాల్సిన పార్టీ. కానీ అధికార పార్టీనే కులం, మతం, ప్రాంతం వేదికగా ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం మారుతున్న క్షుద్ర రాజకీయానికి పరాకాష్టగా కనిపిస్తోంది.

రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి పాలించుకుని ఏం సాధిస్తారు?

వారు రైతులు మాత్రమే. వారికి రాజకీయాలు తెలిస్తే పరిస్థితి ఇక్కడ వరకూ వచ్చి ఉండేది కాదు. కానీ అమాయకులైన.. భూములిచ్చి రోడ్డున పడిన రైతులపై ఇప్పుడు ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొట్టి ఏదో చేద్దామని పాలక పార్టీ ప్రయత్నిస్తోంది. దీని వల్ల ఆ పార్టీకి రాజకీయ లాభం వస్తుందో రాదో చెప్పలేము కానీ.. దారుణంగా దెబ్బతినిపోయేది రాష్ట్రమే. అలాంటి రాష్ట్రాన్ని పరిపాలించుకున్నా వారికి వచ్చేదేమీ ఉండదు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి తాము పీఠాలపై కూర్చుంటే వారికి సంతృప్తిగా ఉంటుందేమో కానీ ప్రజలు మాత్రం ప్రశాంతంగా బతకలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close