తెలుగులో న‌టించాల‌ని వుంది: రేఖ‌

రేఖ మ‌న తెలుగ‌మ్మాయే. తెలుగు సినిమాతోనే న‌టిగా కెమెరా ముందుకొచ్చారు. కానీ.. క్ర‌మంగా బాలీవుడ్ కి వెళ్లి, అక్క‌డి తార‌గా చ‌ల‌మాణీ అయ్యారు. దాదాపు అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ తెలుగులో న‌టించాల‌న్న ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఏఎన్నార్ జాతీయ అవార్డు 2019 అందుకోవ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చారామె. అవార్డు అందుకున్న త‌ర‌వాత త‌న ఆనందాన్ని పంచుకున్నారు. తెలుగులో మ‌ళ్లీ న‌టించాల‌నివుంద‌ని, తెలుగులో ఓ సినిమా చేయాల‌న్న‌ది త‌న అమ్మ చివ‌రి కోరిక‌ని చెప్పారామె. అక్కినేనితో త‌న‌కున్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. తాను చూసిన తొలి సినిమా `సువ‌ర్ణ సుంద‌రి` అని, ఆ సినిమాతోనే సినిమా గురించిన విష‌యాలు తెలిశాయ‌న్నారు.

“అన్న‌పూర్ణ స్డూడియో నా ఇల్లు లాంటిది. ఇక్క‌డ దాదాపు ప‌దేళ్లున్నాను. ఇక్క‌డి ప్ర‌తి మొక్క‌తో, చెట్టుతో నాకు అనుబంధం ఉంది. షూటింగ్ అయ్యాక బంజారా హిల్స్ వైపుగా వెళ్తుంటే అక్కినేని గారి ఇల్లు క‌నిపించేది. రోడ్డుమీద నుంచే దండం పెట్టుకునేదాన్ని. లోప‌ల‌కు ఎప్పుడు వెళ్తానో అనిపించేది. న‌న్ను ఓసారి అక్కినేని భోజ‌నానికి ఆహ్వానించారు. ఎన్నో విలువైన విష‌యాలు చెప్పారు. ఆరోగ్య సూత్రాలు బోధించారు” అని చెప్పుకొచ్చారామె.

నాగ్ గొంతులో… అక్కినేని, శ్రీ‌దేవి, రేఖ బ‌యోగ్ర‌ఫీ

నాగార్జున వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్టు అవ‌తారం ఎత్తారు. అక్కినేని, శ్రీ‌దేవి, రేఖ‌ల పై రూపొందించిన ప్ర‌త్యేక‌మైన ఏవీల‌కు ఆయ‌న గొంతు అందించారు. అక్కినేని జాతీయ అవార్డు ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఈరోజు హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగింది. సాధార‌ణంగా అవార్డు గ్ర‌హీత‌ల కోసం ఏవీల‌ను రూపొందించ‌డం, వాటికి వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్టుల‌తో చెప్పించ‌డం మామూలే. ఏవీలు చెప్ప‌డానికే కొంత‌మంది ప్ర‌త్యేక డ‌బ్బింగ్ క‌ళాకారులు ఉంటారు. అయితే… ఈసారి ఏవీల‌కు అక్కినేని నాగార్జున స్వ‌యంగా వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. నాగ్ గొంతులో ఏఎన్నార్ జీవిత విశేషాలు విన‌డం హృద్యంగా అనిపించింది. అంతే కాదు.. ఈ కార్య‌క్ర‌మాన్ని సైతం ఆయ‌న ముందుండి న‌డిపించారు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు, బిగ్ బాస్ ల‌తో వ‌చ్చిన అనుభ‌వం ఏమో.. కార్య‌క్ర‌మాన్ని ఆసాంతం హాయిగా సాగేలా చేశారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో రేఖ‌ను కొన్ని ప్ర‌శ్న‌లు కూడా అడిగి స‌మాధానాలు రాబ‌ట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి ఇంకెంత మంది బయటకు..!?

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీవీ9పై ఇప్పుడు రాజకీయ రంగు పడింది. అధికారానికి మడుగులొత్తే చానల్‌గా మారిపోయింది. అదే సమయంలో పాత చార్మ్‌ను కొద్ది కొద్దిగా కోల్పోతూ.. వెలిసిపోతూ...

“సీఎంఆర్ఎఫ్ విరాళాల”పై రేవంత్ గురి..!

తెలంగాణ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉంటారు. కేటీఆర్ .. ఫామ్‌హౌస్ విషయాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి టీఆర్ఎస్ ను కాస్త...

కేసీఆర్‌కు రామ్‌మాధవ్ బెదిరింపులేంటో..!?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకలాపాలకు త్వరలోనే ముగింపు తప్పదంటూ... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. కరోనా విషయంలో... కాళేశ్వరం నిర్మాణ...

జగన్ పట్టుబట్టినా కర్ణాటకకే “మందాకిని”..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. కేంద్రానికి ఎంతగా సహకరిస్తున్నా... ఢిల్లీ సర్కార్ మాత్రం.. ఏపీ ప్రయోజనాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీకి కేంద్రం కేటాయిస్తుందని ఆశలు పెట్టుకున్న మందాకిని బొగ్గు గనిని కర్ణాటకకు...

HOT NEWS

[X] Close
[X] Close