కన్నీటి ప‌ర్యంత‌మైన బోనీక‌పూర్‌

అక్కినేని జాతీయ అవార్డు 2018 – దివంగ‌త న‌టి శ్రీ‌దేవికి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె త‌ర‌పున ఈ అవార్డుని బోనీక‌పూర్ అందుకున్నారు. వేదిక‌పై వ‌క్త‌లు శ్రీ‌దేవి గురించి మాట్లాడిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అవార్డు అందుకున్న త‌ర‌వాత త‌న స్పంద‌న తెలియ‌జేస్తూ.. క‌న్నీరు పెట్టుకున్నారు. ఆమె జ్ఞాప‌కాల‌తో మాట్లాడ‌కుండానే ఆయ‌న నిష్కమించారు.

శ్రీ‌దేవికి సంబంధించిన జ్ఞాప‌కాలు కొన్ని నాగార్జున పంచుకున్నారు. “శ్రీ‌దేవిగారితో 4 సినిమాలు చేశాను. తొలి సినిమా ఆఖ‌రి పోరాటం చేస్తున్న‌ప్పుడు నాకు బాగా గుర్తు. ఆమె వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా సెట్లో అంద‌రూ లేచి నిల‌బ‌డేవారు. ఆఖ‌రికి రాఘ‌వేంద్ర‌రావు గారు కూడా నిల‌బ‌డేవారు. మీరెందుకు నిల‌బ‌డ్డారు. ఆమె మీకు ముందు నుంచీ తెలుసు క‌దా అనేవాళ్లం. కానీ ఆయ‌న మాత్రం `త‌ను దేవ‌త‌` అంటుండేవారు. నిజంగానే శ్రీ‌దేవి దేవ‌త‌..” అంటూ ఆమె జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం… షెడ్యూల్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న మోడీ రాజ్ భవన్ లో బస చేశారు....

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close