దేశంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇంకా ప్రత్యేకం. అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవనానికి కేరాఫ్ గా హైదరాబాద్ నిలుస్తుంది. అందుకే ఎక్కువ మంది పారిశ్రామికవేత్తల దృష్టి హైదరాబాద్ పై పడింది. ఇప్పుడు దేశంలో ఎక్కువ మంది దృష్టి గురుగావ్ పైనే ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ వైపే చూస్తున్నారు.
ట్రంప్ టవర్స్ నిర్మాణానికి హైదరాబాద్ లో అడుగులు పడుతున్నాయి. అమెరికన్ స్టైల్ లగ్జరీ హౌసింగ్ టవర్స్ నిర్మించబోతున్నారు. ఇప్పుడు అంబానీ కూడా హైదరాబాద్ లో మంచి ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముకేష్ అంబానీ రియల్ ఎస్టేట్ పై ఇప్పుడిప్పుడేదృష్టి పెడుతున్నారు. రియలన్స్ ఆధ్వర్యంలో గురుగావ్లో మెట్ సిటీని నిర్మిస్తున్నారు. మోడల్ ఎకనమిక్ టౌన్ షిప్ పేరుతో నిర్మాణం జరుగుతోంది. ఇందు కోసం రిలయన్స్ ఎస్వోయూ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్ లో స్థలాల కోసం వాకబు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖేష్ అంబానీ కూడా హైదరాబాద్ రియల్ మార్కెట్ లోకి ఎంటర్ అయితే.. వినియోగదారులకు మరింత సరసమైన ధరలకు ఇళ్లు లభిస్తాయి. పోటీ ఎక్కువ అయితే సహజంగానే ధరలు దిగివస్తాయి. క్వాలిటీ పెరుగుతుంది. ముఖేష్ అంబానీ… లగ్జరీని మధ్యతరగతికి అందుబాటులోకి తీసుకు వస్తే.. మార్కెట్ మారిపోతుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియాలిటి రూపు రేఖలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.