సాంకేతికంగా ఇంకా అత్యున్నత స్థాయి వస్తువులను వినియోగదారులకు అందించాలనే ప్రయత్నంలో సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో మాత్రం చాలా కంపెనీలు ఫెయిల్ అవుతున్నాయి. ఓల్వో బస్సుల నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకూ చాలా వస్తువులు పేలుడు పదార్థాల జాబితాలో చేరుతున్నాయి. భారతీయ వినియోగదారులకు అందిస్తున్న చిన్న కార్ల తయారీలో కనీస రక్షణ చర్యలు కూడా తీసుకోవడం లేదని ఆ మధ్య ఒక అధ్యయనం భయంకరమైన వాస్తవాలను బయటపెట్టింది.
ఇప్పుడిక స్మార్ట్ ఫోన్స్ కూడా అదే బాటలో నడుస్తున్నాయోమోననిపిస్తోంది. టెలికాం బిజినెస్‌ని పూర్తిగా కబ్జా చేయాలన్న తాపత్రయంలో భారీ పబ్లిసిటీతో మార్కెట్లోకి దూసుకొచ్చేసింది రిలయన్స్ జియో. ఎయిర్‌టెల్‌తో సహా మిగతా అన్ని కంపెనీలను బీట్ చేయాలన్న ఉద్ధేశ్యంతోనే వినియోగదారులకు భారీ ఆఫర్స్‌ని ఆఫర్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవే కాబట్టి తప్పు పట్టాల్సిన పనిలేదు కానీ ఇఫ్పుడు రిలయెన్స్ జియో ఫోన్ తయారీలో తీసుకున్న సేఫ్టీ మెజర్మెంట్స్పై బోలెడన్ని సందేహాలు వచ్చేస్తున్నాయి. తన్వీర్ సాధిఖ్ అనే వినియోగదారుడు యూజ్ చేస్తున్న రిలయెన్స్ జియో ఫోన్ పేలిపోయింది. తృటిలో నా ఫ్యామిలీకి ప్రమాదం తప్పిందని అతను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ఆ పోస్ట్‌ని రిట్వీట్ చేశాడు. పేలిపోయిన జియో ఫోన్ ఫొటోలు చూస్తుంటే మాత్రం ప్రమాదకరమైన విషయంగానే అర్థమవుతోంది. రిలయన్స్ వాళ్ళు ఈ పేలుడు విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.