బ్యానర్ ఓకే… హీరో ఎవరు?

దర్శకుడు బోయ‌పాటి శ్రీ‌ను కొత్త సినిమా ఖరారైయింది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు. ‘స్కంద’ లాంటి పరాజయం తర్వాత బోయపాటికి దారెటనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో జరిగింది. అయితే ఇప్పుడు గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లోనే ఆయన సినిమా ఓకే అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా బయటికి వచ్చింది. అయితే బ్యానర్ ఓకే అయ్యింది కానీ హీరో ఎవరనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. అల్లు అర్జున్ తో బోయపాటి ఓ సినిమా చేస్తారనే కథనాలు వినిపించాయి. గతంలో సరైనోడు లాంటి సక్సెస్ ని అందుకున్న కాంబో ఇది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ నిర్మాణంలో బోయపాటి సినిమా ఓకే అవ్వడంతో..ఆ సినిమా ఇదే అనడానికి మరింత బలం చేకూరింది. హీరో ఎవరనేదానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలవడనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెవిరెడ్డి కొడుకు అరెస్ట్

ఎన్నికల సమయంలో తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని చంపేందుకు పక్కా ప్లాన్ చేసిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. పోలింగ్ ముగసిన తర్వాత...

యానిమల్.. సారీ చెప్పేవరకూ వదల్లేదు

యానిమల్ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించవచ్చు. రన్బీర్ కపూర్ కెరీర్ లో హయ్యస్ట్ వసూళ్లు తెచ్చి పెట్టిన సినిమా కావచ్చు. కానీ ఆ సినిమాపై అదే స్థాయిలో విమర్శలు వున్నాయి. ఈ...

సోకులపాలెం సోగ్గాడు నాని

నాని, వివేక్ ఆత్రేయ 'సరిపోదా శనివారం'కోసం మళ్ళీ కలిశారు. గతంలో 'అంటే సుందరానికీ' లో నానిని స్మార్ట్ అండ్ క్యూట్ గా చూపించిన వివేక్ ఈసారి తనలోని రగ్గడ్ అవతార్ ని ప్రజెంట్...

మోదీతో గేమ్స్ ఆడుతున్న నితీష్

జేడీయూ చీఫ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. తన డిప్యూటీ లను పంపారు. రాజకీయాల్లో ఎలాంటి చర్చలు జరుగుతాయో తెలుసు కాబట్టి.. అలాంటి చర్చలు జరగాలన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close