‘ఫైటర్’ రివ్యూ: బాలీవుడ్ ‘టాప్ గన్’

Fighter Movie review

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

రొమాంటిక్ కామెడీలు తీసే దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దారిని మార్చిన హీరో హృతిక్ రోష‌న్‌. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’తో కామెడీ జానర్ ని వదిలి లార్జర్ దేన్ లైఫ్ కథలవైపు వచ్చాడు సిద్ధార్థ్. తర్వాత వీరిద్దరూ కలసి చేసిన ‘వార్’ సినిమా ప్రేక్షకులని అలరించింది. షారుక్ ఖాన్ ‘పఠాన్’ తో వెయ్యికోట్లు అందించిన దర్శకుడి జాబితాలో చేరిపోయాడు సిద్ధార్థ్. ఇప్పుడు హృతిక్ రోష‌న్‌ ‘ఫైటర్’ చేశాడు. మనదగ్గర ఎయిర్ ఫోర్స్ యాక్ష‌న్ సినిమాలు అరుదు. అలాంటి అరుదైన జోనర్ లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? హృతిక్, సిద్ధార్థ్ మరో విజయాన్ని అందుకున్నారా ?

సంషేర్ ప‌ఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోష‌న్‌), మిన‌ల్ (దీపికా ప‌దుకొణె) తాజ్ (క‌ర‌ణ్ గ్రోవ‌ర్‌), బషీర్ (అక్షయ్ ఒబెరాయ్‌) ఈ నలుగురూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్స్. రాకీ (అనిల్ క‌పూర్‌) నేతృత్వంలో పని చేస్తుంటారు. ఇందులో పాటీ దూకుడు స్వభావం కలిగిన ఎయిర్ ఫైటర్. నిబంధనల్ని సైతం అతిక్రమించి సాహసాలు చేస్తుంటాడు. తన దూకుడు స్వభావం కారణంగా ఒక ఫైటర్ ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఆ బాధ పాటీని వెంటాడుతుంటుంది. పుల్వామా లో జరిగిన ఉగ్రదాడికి బదులు చెప్పడానికి పాటీ అండ్ టీం పాక్ లోని ఉగ్ర స్థావరాలని లక్ష్యంగా చేసుకొని సర్జికల్ స్ట్రైక్ కి సిద్ధమౌతారు. తర్వాత ఏం జరిగింది? ఈ దాడిలో పాటీ అండ్ టీం ఎలాంటి పోరాటం కనపరిచింది? ఉగ్రవాదులని మట్టికరిపించే క్రమంలో ఎలాంటి సవాళ్ళుని ఎదురుకుందనేది మిగతా కథ.

ఎయిర్ ఫోర్స్ – ఉగ్రవాదం నేపధ్యంలో బాలీవుడ్ యాక్షన్ మసాలా ఎలిమెంట్స్ తో తీర్చిద్దిన ఏరియల్ అడ్వంచ్ సినిమా ఇది. వార్, పఠాన్ చిత్రాల్ని ఇండియా వెర్సస్ పాకిస్తాన్ అన్నట్టుగా తీర్చిదిద్దిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ .. ఫైటర్ ని మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్- ఉగ్రవాదం చుట్టూ నడిపాడు. కథ నెమ్మదిగా, నింపాదిగా మొదలౌతుంది. పాత్రలు, ఎయిర్ పోర్స్ నేపధ్యాన్ని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకున్నారు. పుల్వామా ఎటాక్ తర్వాత కథలో సీరియస్ నెస్ వస్తుంది. ఎయిర్ ఫోర్స్ ఫైట్స్ నేపధ్యంలో తక్కువ సినిమాలే వచ్చాయి. దీంతో పెద్ద కాన్వాస్ పై అలాంటి ఎయిర్ ఫైట్ చేస్తున్న ప్రేక్షకులకు అది థ్రిల్ పంచుతుంది. అయితే ఎంత యాక్షన్ సినిమాలోనైనా కోర్ ఎమోషన్ చాలా ముఖ్యం. ఇందులో ఆ ఎమోషనే లోపించింది. పైగా ఈ కథని ప్రేక్షకులు ముందే ఊహించినట్లుగా రాసుకున్నాడు. తెరపై అలా సన్నివేశాలు వెళ్తుంటాయి కానీ అంత థ్రిల్ ని పంచేలా వుండవు.

పైగా ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకూ హాలీవుడ్ సినిమా ‘టాప్ గన్’ పోలికలు అడుగడుగునా కనిపిస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్, కథ నడిపిన తీరు, గగనతలంలో జరిగే యాక్షన్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ ‘టాప్ గన్’ ని గుర్తు చేస్తాయి. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత హృతిక్ ఫైటర్ పోస్ట్ ని వదిలేసి శిక్షకుడిగా రావడం చూస్తే మరీ మక్కీకి మక్కీ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ ని పక్కన పెట్టి హ్యూమన్ ఎమోషన్ మీద కొత్త డ్రామా నడపడటానికి ప్రయత్నించారు. అయితే ఇది అంత ఆర్గానిక్ గా కుదరలేదు. మినల్ పాత్ర రూపంలో అడ మగ సమానత్వం గురించి కూడా కొన్ని సన్నివేశాలు నడిపారు. ఇలాంటి దేశభక్తి యాక్షన్ డ్రామాలకు అలాంటి ట్రాక్ ఇరికించడం చాలా కష్టం. అయితే అశుతోష్ రానా, దీపిక లాంటి పెర్ఫార్మర్స్ వుండటంతో చివర్లో అది కొంచెం టచ్చింగానే వుంటుంది. ఇక క్లైమాక్స్ ని ప్రేక్షకుడు అరగంట ముందే ఊహించేస్తాడు. ఆ ఊహకు తగ్గట్టే గాల్లో విన్యాసాలు జరుగుతాయి. యాక్షన్ విషయానికి వచ్చేసరికి టాప్ గన్ లాంటి సహజత్వాన్ని ప్రదర్శించి వుంటే బావుండేది. ఈ విషయంలో మాత్రం బాలీవుడ్ యాక్షనే కనిపిస్తుంది. కొన్ని చోట్లయితే యుద్ధ విమానాల్ని మరీ ఆటోలు నడిపినట్లు నడిపేసి.. గాల్లోనే వార్నింగులు ఇచ్చుకోవడం శ్రుతి మించిన సినిమాలిబర్టీనే.

ఫైటర్ పాటీ పాత్రకు హృతిక్ రోష‌న్‌ కటౌట్ సరిగ్గా సరిపోయింది. కథ, కథనాలు బలహీనంగా ఉన్నప్పటికీ తన స్క్రీన్ ప్రజెన్స్ తో లాక్కొచ్చాడు. ఎమోషనల్ సీన్స్ సెటిల్డ్ గా చేశాడు. తన ఫిట్నెస్ ఇలాంటి పాత్రలకు చాలా ప్లస్ అవుతుంది. గాల్లో ఎగిరిపోతూ ఫైట్ల్స్ ని క్యాచ్ చేసినా సరే నమ్మబుద్ధేస్తుంది. ఇది తను తెరపై సాలిడ్ గా కనిపిస్తున్న తీరుతోనే సాధ్యపడుతోంది. దీపిక కి ఈ కథలో చెప్పుకోదగ్గ స్కోప్ లేదు. జెండర్ ఈక్యాలిటీ చెప్పడానికి మాత్రమే ఆ పాత్రని తీసుకున్నారా అనే భావన కలిగిస్తుంది. అనిల్ కపూర్ హుందాగా కనిపించారు. వినయ్ వర్మకు కూడా మంచి పాత్ర దక్కింది. క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌, అక్షయ్ ఒబెరాయ్‌ తమ వంతు న్యాయం చేశారు. ఉగ్రవాదిగా చేసిన రిషబ్ సాహ్ని పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. ఉగ్రవాదాని చేపుకోవడమే తప్పితే అతడికో లక్ష్యం వుండదనిపిస్తుంది. అదొక బలహీనతగా మారింది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

టెక్నికల్ గా సినిమా రిచ్ గా కనిపిస్తుంది. పాటలకు స్కోప్ లేదు కానీ సంచిత్- అంకిత్ చేసిన స్కోర్ మాత్రం బావుంది. సచ్చిత్ పాలోస్ కెమరా వర్క్ కి మంచి మార్కులు పడతాయి. గ్రాఫిక్స్ వర్క్ బావుంది. ఎయిర్ ఫైట్స్ ని చాలా వరకూ రియలిస్ట్ గా చూపించగలిగారు. టాప్ గన్ లాంటి ఎయిర్ యాక్షనర్స్ చూడని ప్రేక్షకులకు ఫైటర్ యాక్షన్ కొత్త అనుభూతిని ఇచ్చే అవకాశం వుంది. అయితే కథ, కథనంలో ఫైటర్ పెద్ద ప్రభావాన్ని చూపించలేదు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘పఠాన్’ సినిమాపై కొన్ని విమర్శలు వచ్చాయి. లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ చూపించే క్రమంలో లాజిక్స్ ని వదిలేశారని కామెంట్లు వినిపించాయి. అయితే షారుక్ స్టార్ డమ్ అక్కడ మ్యాజిక్ చేసింది. ఇప్పుడు హృతిక్ రోష‌న్‌ చరిస్మా ఎంతటి మ్యాజిక్ చేస్తుందన్న పాయింట్ మీదే ఫైటర్ బాక్సాఫీసు సక్సెస్ ఆధారపడి వుంది.

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

రౌడీ బ‌ర్త్ డేకి.. బోలెడ‌న్ని స‌ర్‌ప్రైజ్‌లు

ఈనెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రౌడీ కొత్త సినిమా సంగ‌తులన్నీ ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close