ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డ‌బుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. మార్చిలోనే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. కొంత‌కాలంగా షూటింగ్ కూడా జ‌ర‌గ‌లేదు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రారంభించుకొంది. ముంబైలో మ‌రో ద‌ఫా షూటింగ్ మొద‌లెట్టారు. ఈ షెడ్యూల్ తో టాకీ మొత్తం పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత పాట‌ల్ని తెర‌కెక్కిస్తే సినిమా అయిపోయిన‌ట్టే.

సంజ‌య్‌ద‌త్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మ‌ణిశ‌ర్మ స్వరాలు అందిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో పాట‌ల‌న్నీ మాసీగా సాగిపోయాయి. ఈసారీ.. అదే మ్యాజిక్ రిపీట్ చేయ‌బోతున్నార్ట‌. యాక్ష‌న్‌, మాస్‌, బీట్.. ఇవ‌న్నీ టైటిల్ కి త‌గ్గ‌ట్టుగానే `డ‌బుల్ డోస్‌`లో ఉండ‌బోతున్నాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఇప్ప‌టికే ఓటీటీ హ‌క్కులు నెట్ ఫ్లిక్స్‌కి అమ్మేసిన‌ట్టు టాక్‌. థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలోనూ క్రేజీ ఆఫ‌ర్లు అందుతున్నాయి. త్వ‌ర‌లోనే రిలీజ్‌డేట్ విష‌యంలోనూ ఓ క్లారిటీ రాబోతోంది. ఇక‌పై `డ‌బుల్ ఇస్మార్ట్‌`కి సంబంధించి రెగ్యుల‌ర్ అప్‌డేట్లు ఉంటాయ‌ని పూరి స‌న్నిహితులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ పర్సంటేజీ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతేనా ?

ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా రెండు శాతం పెరిగింది. ఈ రెండు శాతం చిన్నది కాదు. ఎందుకంటే హై పోలింగ్ లో ఎంత చిన్న మొత్తం పెరిగినా...

రేవంత్‌కు రుణమాఫీ అంత వీజీ కాదు !

రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రేవంత్ డెడ్ లైన్ పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది. హామీని పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు రెండు...

అదే వైసీపీ కొంపముంచనుందా..?

ఏపీలో అధికారపీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎవరిని కదిలించినా ఫలితాల గురించే ముచ్చట. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో కూటమిదే విజయమని...

‘మిరల్’ రివ్యూ: చీకటి నాటకం

ఈ సమ్మర్ లో సరైన సినిమా పడలేదు. అక్యుపెన్సీ లేకపోవడంతో సింగిల్ స్క్రీన్స్ రెండు వారాలు క్లోజ్ చేస్తున్నట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ వారం రావాల్సిన సినిమాలు వెనక్కి వెళ్ళాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close