జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి…ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అనివార్యతను క్రియేట్ చేస్తున్నారు. రేవంత్ ఆరోపిస్తున్నట్లుగానే బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేయనుందా..? అని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

లోక్ సభ ఎన్నికలు ప్రారంభమైన కొద్ది కాలం కిందటి వరకు బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద బలమైన ఆయుధం లేకపోయిందన్నది విశ్లేషకుల మాట. ప్రజాస్వామ్య పరిరక్షణ – భారత్ జోడో అనే నినాదంతో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినా అది పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. ఇదే సమయంలో బీజేపీ మాత్రం పదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించకపోగా..మతం పేరిట రాజకీయాలు చేసేలా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. మైనార్టీ పేరిట మెజార్టీల మనోభావాలను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేలా వ్యూహం ప్రకారం ముందుకు సాగింది.

ఈ క్రమంలోనే బీజేపీకి ముకుతాడు వేసేలా రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీని ఇరుకున పెట్టాలంటే రిజర్వేషన్ల రద్దు అంశమే ప్రధాన ఎజెండా అవుతుందని.. ఇందుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఎజెండా కూడా రిజర్వేషన్ల రద్దు అంటూ ఆధారాలతో సహా నిత్యం జనాల్లో చర్చకు పెడుతున్నారు. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దును బలపర్చడమే అవుతుందంటూ ఆరోపిస్తున్నారు.

మోడీ, అమిత్ షాలను టార్గెట్ చేస్తూ రేవంత్ విమర్శలు చేస్తుండటంతో రేవంత్ వ్యాఖ్యలకు జాతీయ స్థాయిలో కూడా స్పేస్ దక్కుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు రేవంత్ ఓ అస్త్రాన్ని ఇచ్చారని.. ఇది కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో మేలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యాంగంపై కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడినా రిజర్వేషన్ల రద్దు అంటూ రేవంత్ లేవనెత్తిన ఈ అంశం చుట్టే మూడు , నాలుగు రోజులుగా జాతీయ రాజకీయాలు తిరుగుతుండటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఫోకస్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం... అటు...

మరికాసేపట్లో భారీ వర్షం…ఎవరూ బయటకు రావొద్దని అలర్ట్..!!

హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close